ట్రెండీ టాక్: ఝడుసుకున్న నటవారసులు..!

Movie NewsAnanya Panday Talks About Nepotism

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ `ధడక్` చిత్రంతో ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా తెలివైన ఎంపికలతో ఈ యంగ్ హీరో తెరపై దూసుకెళుతున్నాడు. హ్యాండ్సమ్ లుక్ కంటే నటనతోనే ఈ కుర్రాడు మెప్పిస్తున్నాడు.

చంకీ పాండే కుమార్తె అనన్య పాండేతో కలిసి ఇషాన్ నటించిన కొత్త చిత్రం `ఖలీ పీలీ` థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయకుండానే డైరెక్ట్ OTT స్ట్రీమింగ్ కోసం వెళుతున్నట్లు తాజాగా కథనాలొస్తున్నాయి. జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు.. ఖలీ పీలీ బాలీవుడ్ లో మొదటి పే-పర్-వ్యూ చిత్రంగా నిలుస్తుందన్న సమాచారం అందింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున రిలీజవుతుందట. ఖలీ పీలీకి మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహించారు.  జీ స్టూడియోస్ సహకారంతో హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నటవారసురాలు అనన్య పాండే సినిమాలు వీక్షించేందుకు ఔట్ సైడర్స్ సిద్ధంగా లేరు. ఔట్ సైడర్స్ పై కుట్రలు చేసే బాలీవుడ్ లో నటవారసులకు సోషల్ మీడియాల నుంచి ఎటాక్ తప్పడం లేదు. ఇంతకుముందు రిలీజైన ఖలీ పీలీ టీజర్ డిజ్ లైక్స్ తో రకరకాల సందేహాలు అలుముకున్నాయి. ఔట్ సౌడర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతర పరిణామమిది. ఇప్పుడు ఇద్దరు నటవారసులు నటించిన సినిమా పరిస్థితేమిటో? అన్న చర్చా సాగుతోంది. ఇలాంటి రకరకాల సందిగ్ధతల నడుమ ట్రైలర్ విడుదల చేయకుండానే ఈ మూవీని ఓటీటీల్లో రిలీజ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.Source link

www.tupaki.com

Leave a Reply