ట్రెండీ టాక్: నటవారసుడు తానొకటి తలిస్తే..!

Movie NewsSad News For akhil surender reddy movie

అక్కినేని వారబ్బాయి అఖిల్ కెరీర్ పరంగా సరైన బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. నవతరానికి అవకాశం ఇచ్చినా… పెద్ద స్థాయి దర్శకులను వలేసి పట్టుకోవడంలో తడబాటుకు గురవ్వడం  కెరీర్ పరంగా మైనస్ అవుతోంది. అపజయమెరుగని స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్- కొరటాల శివలతో సినిమాలు చేయాలని ప్రయత్నించినా ఎందుకో అవి మెటీరియలైజ్ కాలేదని గుసగుసలు వినిపించాయి. అయితే సీనియర్లు ఎవరూ స్టార్ హీరోలకు తప్ప నవతరానికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్న నిజం తెలిసినదే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా పనుల్లో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. ఇక కొరటాల శివ ప్రస్తుతం `ఆచార్య`ని పూర్తి చేసి ఆ తరువాత అల్లు అర్జున్  సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో వున్నాడు. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి తో అఖిల్ ఓ భారీ స్పై థ్రిల్లర్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి 45 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని నిర్మాత ఎవరూ ముందుకు రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమస్యలతో ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టి పవన్ కు సురేందర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది మీడియా కథనాల సారాంశం.

పవన్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మాత రామ్ తాళ్లూరి ఆఫీషియల్ గా ప్రకటించడంతో అఖిల్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. తన చేతిలో వున్న ఒక్క పెద్ద డైరెక్టర్ కూడా చేజారి పోవడంతో అఖిల్ బాగా నిరాశపడ్డాడట. పవన్ కోసం కథని సిద్ధం చేసే పనిలో సురేందర్ రెడ్డి లాక్ కావడంతో అఖిల్ మరో సీనియర్ దర్శకుడి కోసం వెతుకుతున్నారట. Source link

www.tupaki.com

Leave a Reply