ట్రెండీ టాక్: పూలరంగడి సమస్యలు పూరీని ఇరికిస్తాయా?

Movie NewsNepotism Effect On Puri Jagannadh Fighter

బాలీవుడ్ లో స్వపక్షపాతం.. నటవారసత్వ పోకడలపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. సుశాంత్ సింగ్ బలవన్మరణం అనంతరం ఇది పరాకాష్టకు చేరుకుంది. నెప్టోయిజం (నటవారసులు) స్టార్లు కనిపిస్తే చాలు జనం చిరాకు పరాకులు ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాల్లో అయితే డిస్ లైక్ లతో నెపోటిజం స్టార్లను ఒక ఆట ఆడుతున్నారు. ఉత్తరాదిన ఇదొక ఉద్యమంలా నడుస్తోంది.

సరిగ్గా ఇదే ఇక్కడ మన ట్యాలెంటెడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కి చిక్కులు తెచ్చి పెడుతోంది. విజయ్ దేవరకొండ సరసన ఫైటర్ చిత్రం కోసం నటవారసురాలిని ఎంపిక చేయడమే అందుకు కారణం. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే వారసురాలు అనన్య పాండేని దేవరకొండ సరసన నాయికగా ఎంపిక చేసుకున్నారు పూరి-చార్మి బృందం. పైగా నటవారసుల్ని ఎంపిక చేసుకుని స్టార్లుగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడే కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాతతో కలిసి పాన్ ఇండియా సినిమా అంటూ భారీగా ప్లాన్ చేసారు.

ఇవన్నీ గమనించిన నెటిజనం మాత్రం అస్సలు ఫైటర్ టీమ్ ని వదిలేట్టు లేరని విశ్లేషిస్తున్నారు. నటవారసురాలు అనన్య .. పూలరంగడు కరణ్ జోహార్ వల్లనే పూరి చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సందేహిస్తున్నారు. ఫైటర్ చిత్రానికి ప్రమోషన్ కి వెళ్లేప్పటికి పూరీ-ఛార్మి బృందానికి చాలా విషయాలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఆలియా.. అనన్య… కరణ్.. జాన్వీ .. సోనమ్  వీళ్లందరినీ నెటిజనులు ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు. వీళ్ల సినిమాల ప్రమోషన్స్ కి సంబంధించిన ప్రతిదీ వివాదాస్పదం అవుతుందా ఈ నెప్టో కిడ్స్ వల్ల అన్న సందేహం పదే పదే వ్యక్తమవుతోంది. అనన్య నటించిన తాజా చిత్రం ఖలీ పిలీ ట్రైలర్ కి వచ్చిన డిస్ లైక్స్ ని చూస్తే ఫైటర్ కి ఈ ముప్పు తప్పదన్న అంచనా వేస్తున్నారు.Source link

Leave a Reply