ట్రెండీ టాక్: ప్రభాస్ లుక్ చూశాక స్టన్నవ్వాలి!

Movie NewsStunning after seeing Prabhas look!

సినిమా ఏదైనా సెలక్షన్ ఏదైనా కానీ…!! అందులో వైవిధ్యమైన లుక్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ లుక్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ కనబరుస్తున్న శ్రద్ధను ప్రశంసించి తీరాలి. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత అతడు `సాహో` కోసం లుక్ పరంగా చాలా మార్పులు చూపించాడు. అందుకోసం విదేశాలకు వెళ్లి ఫిజికల్ ఫిట్ నెస్ ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఇందులో స్లిమ్ లుక్ ఆకట్టుకుంది.

ఇప్పుడు రాధే శ్యామ్ కోసం అతడు అంతే శ్రద్ధ కనబరచడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ తాజా చిత్రంలో లుక్ పరంగా చాలా వేరియేషన్స్ ట్రై చేస్తున్నాడని తెలిసింది. అతడి లుక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు రాధాకృష్ణ ఇన్ పుట్స్ తీసుకుని ప్రత్యేకంగా తనని తాను తీర్చిదిద్దుకున్నాడు డార్లింగ్.

ఇక స్కిన్ టోన్ సహా ప్రతిదీ డిఫరెంటుగానే ట్రై చేస్తున్నాడు డార్లింగ్. రెండు భారీ పాన్ ఇండియా సినిమాలకు కమిటైన ప్రభాస్ అంతకుముందే ప్రేమకథా చిత్రంలో పూర్తి వైవిధ్యంగా కనిపించనున్నాడు. ప్రభాస్ స్కిన్ టోన్ ఇంతకుముందు ఎప్పుడూ.. ఇలా లేదే! అనేంత అల్ట్రా స్మార్ట్ గా కనిపించనున్నారట. ఇదివరకూ రిలీజైన రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అభిమానులు సహా అన్ని వర్గాల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే అందచందాలు ప్రధానంగా హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ – గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.Source link

www.tupaki.com

Leave a Reply