ట్రెండీ టాక్: బాలయ్యపై నాగబాబు తమాషా చూశారా?

Movie NewsTrendy Talk: Did you see Nagababu's joke on Balayya?

అప్పటికప్పుడే తిట్టేయడం అప్పటికప్పుడే పొగిడేయడం.. ఈ స్ట్రాటజీని
ఏమని అనాలి? ఏమో మెగా బ్రదర్ నాగబాబుకే ఎరుక. ఆయనకు కోపం వస్తే
తిట్టేస్తారు. ఆ తర్వాత వెన్నపూస రాసినట్టు మాటలతో కూల్ చేసేస్తారు.
ఇది అలాంటి ప్రయత్నమేనని ఇదిగో బాలయ్యపై తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి
మరి.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా బ్రదర్ నాగ బాబు
హీరో నందమూరి బాలకృష్ణపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
తేదేపా వర్సెస్ జనసేన ఎపిసోడ్స్ అవి అని అందరికీ తెలుసు. యూట్యూబ్
చానెల్ ఇంటర్వ్యూల్లో బాలయ్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.
కానీ వాటికి బాలయ్య బాబు స్పందించలేదు.

ఇప్పుడు దానికి
కాంట్రాస్టుగా .. బాలకృష్ణ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి నాగబాబు మరో
షాకిచ్చారు. ఆసక్తికరంగా ఇది పవన కల్యాణ్ బాలయ్యను కలిసినప్పటి
ఫోటో అట. అది కూడా పవన్ తొలిసారి కలిసారట. మూడు వేర్వేరు ఫోటోల్ని
నాగబాబు షేర్ చేశారు. ఇలాంటివి తన వద్ద చాలా ఉన్నాయని తెలిపారు. “2
బ్రదర్స్ కలిసి .. 1 నా సోదరుడు అలాగే మరొకరు మరొక తల్లి నుండి
సోదరుడు…. పవర్ స్టార్ నందమూరిలియన్ ను కలిసిన రోజు“అంటూ కాస్త తమాషా
వ్యాఖ్యానాన్ని జోడించారు. మరీ అంత సాఫ్ట్ గా బాలయ్య గురించి నాగబాబు
ప్రస్థావించడం చూస్తుంటే మిన్ను విరిగి మీద పడబోతోందా? అన్న సందేహం
వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. పార్టీల పరంగా సిద్ధాంతాల పరంగా
ఫ్యానిజం పరంగా ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయా? అన్న చర్చ హీటెక్కిస్తోంది.Source link

www.tupaki.com

Leave a Reply