ట్రెండీ టాక్: యూత్ స్టార్ షాకింగ్ డెసిషన్..!

Movie NewsNitin Shocking Decision On Rangde Movie

యూత్ స్టార్ నితిన్ ఈ ఏడాది `భీష్మ`తో డీసెంట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇదే జోష్ లో హిట్టొచ్చాక పెళ్లితో ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలని పట్టాలెక్కిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి నితిన్  `రంగ్ దే` చిత్రాన్ని చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.

ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ని పునః ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. త్వరగా బ్యాలెన్స్ గా వున్న షూట్ ని పూర్తి చేసి మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. థియేటర్స్ రీ ఓపెన్ కావడం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు అందుతుండటంతో ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్- జీ5 వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ చిత్ర బృందానికి భారీ ఆఫర్లు వచ్చినట్టు చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి కీలకంగా నిలిచే యూరప్ షెడ్యూల్ ని త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్ రిలీజ్ పై కీలక నిర్ణయం తీసుకున్న అనంతరం యూరప్ ట్రిప్ ని డిసైడ్ చేస్టారట. ఇటీవల విడుదలైన టీజర్ కు అనూహ్య సంపందన రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.Source link

www.tupaki.com

Leave a Reply