ట్రెండీ టాక్: రాంగ్ టైమ్ లో SRK డాటర్ బరిలో దిగుతోందా?

Movie NewsSuhana Khan Shares Her College Friends Pic In Instagram

కింగ్ ఖాన్ షారుఖ్ – గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ పరిస్థితులు సహకరించి ఉంటే ఈపాటికే బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఉండేది. మహమ్మారీ ఈ బ్యూటీ సినీఎంట్రీకి ఇబ్బందికరంగానే పరిణమించిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2018 చివరిలోనే అదిరే ఫోటోషూట్ తో తెరపైకొచ్చిన ఈ బ్యూటీ ఇప్పటికే వరుస ఫోటోషూట్లతో హీట్ పెంచింది. సుహానా డెబ్యూ మూవీ కోసం ఎదురు చూస్తుండగా ఇలా వైరస్ ప్రకోపం తీవ్రంగా మారింది.

అదంతా సరే కానీ .. ఈ మాయదారి మహమ్మారీ తననుంచి స్నేహితులు దూరమయ్యేలా చేసింది. ఈ ఆవేదనను సుహానా దాచుకోలేక తాజాగా తన స్నేహితులతో ఉన్నప్పటి ఓ థ్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసి `మిస్సింగ్` అంటూ వ్యాఖ్యను జోడించింది. దీనికి తన బాలీవుడ్ స్నేహితురాలు షానయ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. `అందం` అన్న వ్యాఖ్యతో షారూక్ డాటర్ ని పొగిడేసింది.

మహమ్మారి వల్ల ముంబైలో ఇంట్లోనే ఉండిపోయిన సుహానా తన కళాశాల స్నేహితులు దూరమయ్యారని ఆవేదన చెందుతుంటే షానయ లాంటి ఫ్రెండ్స్ మాత్రం ఊరడిస్తున్నారు. UK లోని ఆర్డింగ్లీ కాలేజీలో సుహానా ఖాన్ స్టడీస్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది నటవారసురాళ్ల తరహాలోనే సుహానా సినిమాల్లోకి రావాలని ఎదురుచూస్తున్నారు. ఫిలిం స్టడీస్ కోసం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చేరి ప్రత్యేక శిక్షణ పొందారు. తనతో పాటు సోదరుడు ఆర్యన్ ఖాన్ కూడా ఫిలింస్టడీస్ కొనసాగిస్తున్న సంగతి విధితమే. ఇక ఫిలిం అకాడెమీలో స్టడీస్ చేసేప్పుడే `ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ` అనే షార్ట్ ఫిల్మ్ లో సుహానా నటించింది. ఫ్యాన్స్ కి తన నటన పిచ్చిగా నచ్చేసింది. సాధ్యమైనంత తొందర్లోనే కరణ్ జోహార్ స్వయంగా సుహానాని వెండితెరకు పరిచయం చేసే వీలుందన్న ప్రచారం సాగుతోంది. ఈలోగానే బాలీవుడ్ లో నెపోటిజం సహా సుశాంత్ సింగ్ ఇష్యూ.. డ్రగ్స్ వాడకం వగైరా మంటలు పుట్టిస్తున్నాయి. కంగన సహా పలువురు తారలు నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం నెగెటివ్ సిగ్నల్ ఇచ్చినట్టయ్యింది. ముఖ్యంగా నటవారసురాళ్లకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న వేళ సుహానా ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేయడం సరైనదేనా? అన్న ప్రశ్న ఎదురవుతోంది.Source link

www.tupaki.com