ట్రెండీ టాక్: రోహిత్ సున్నితంగా తిరస్కరించాడట!

Movie Newsnara rohit says no to pushpa

టాలీవుడ్ లో `ఆర్.ఆర్.ఆర్` తరువాత ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం `పుష్ప`. లెక్కల మాస్టారు సుకుమార్ `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ రికార్డ్ హిట్ ఇచ్చిన తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే బన్నీ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని మరింతగా ఎలివేట్ చేసే పవర్ ఫుల్ విలన్ కోసం ఇప్పటికీ సుకుమార్ అన్వేషిస్తూనే వున్నారు.

ముందు ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. ఆ తరువాత ఆ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. ఇంత వరకు ఎవరిని సెలెక్ట్ చేశారన్న దాంట్లో క్లారిటీ లేదు. అయితే గత కొన్ని రోజులుగా ఆ పాత్ర కోసం నారా రోహిత్ ని చిత్ర బృందం సంప్రదిస్తోందని వార్తలు షికారు చేస్తున్నారు. నారా రోహిత్ మాత్రం ఆ పాత్రలో నటించడానికి అంగీకరించడం లేదట. దానికి బలమైన కారణం వుందని తెలుస్తోంది.

గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్ని చూసిన నారా రోహిత్ సైలెంట్ గా వుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే తన లుక్ ని మార్చుకుని కొత్త తరహా చిత్రానికి సిద్ధమయ్యారు. ఎలాగైనా మళ్లీ సూపర్ హిట్ ని దక్కించుకుని ట్రాక్ లోకి రావాలని ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నారట. ఇలాంటి దశలో `పుష్ప`లో నటించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. అందుకే సుకుమార్ ఆఫర్ ని నారా రోహిత్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది.Source link

www.tupaki.com

Leave a Reply