ట్రైలర్ టాక్ : క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘లూట్ కేస్’Trailer Talk: 'Loot Case' as Crime Comedy Entertainer

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూసివేయడంతో కొత్త సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మూవీ ‘లూట్ కేస్’ కూడా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల కానుంది. కునాల్ ఖేము హీరోగా నటిస్తున్న ‘లూట్ కేస్’ సినిమాకి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టూడియోస్ మరియు సోడా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానున్న ‘లూట్ కేస్’ ట్రైలర్ నేడు రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఇంట్రెస్టింగ్ గా ఆహ్లాదకరంగా సాగింది. ట్రైలర్ విజయ్ రాజ్ ‘మిగతా సూట్ కేస్ ఎక్కడ’ అని అడగడంతో స్టార్ట్ అవుతుంది. 2 నిముషాలు 56 సెకన్స్ ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

‘లూట్ కేస్’ సినిమా మొత్తం ఒక సూట్ కేస్ చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. నందన్ కుమార్ అనే మధ్యతరగతి వ్యక్తికి 2000 రూపాయల నోట్లతో నిండిన సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసు కోసం పోలీసులు రాజకీయ నాయకులు మరియు పవర్ ఫుల్ డాన్ సహా పలువురు వెతుకులాట సాగిస్తుంటారని తెలుస్తోంది. హీరో ఆ సూట్ కేసుని ఏమి చేసాడు.. దాని వలన అతను ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు.. వాటి నుండి ఎలా బయటపడ్డాడు అనే ఇతివృత్తంలో హ్యూమరస్ గా చెప్పే ప్రయత్నం చేసారని ట్రైలర్ తో అర్థం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.

క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘లూట్ కేస్’లో కునాల్ ఖేము నందన్ కుమార్ పాత్రలో నటిస్తుండగా రసికా దుగల్ అతని భార్య ‘లత’ పాత్రలో నటించింది. విజయ్ రాజ్ ‘డాన్’గా కనిపించగా రణ్వీర్ షోరే పోలీసుగా నటించాడు. గజరాజ్ పొలిటిషియన్ గా కనిపించాడు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మల్టీప్లెక్స్ లో జూలై 31న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *