ట్రైలర్ టాక్: సామాన్యుడికి సైతం విమానయాన సౌకర్యం అందించిన వ్యక్తి కథ ‘ఆకాశం నీ హద్దురా’

Movie NewsAakaasam Nee Haddhu Ra Official Trailer

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ”సూరారై పొట్రు”. టాలీవుడ్ లో సూర్యకు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కరోనా కారణంగా థియేటర్స్ మూతబడి ఉండటంతో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ముందుగా అక్టోబర్ 30న విడుదల చేస్తున్నామని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

‘వ్యవసాయం చేసే వాడు విమానం ఎక్కుతాడు’ అని ట్రైలర్ లో చెప్పడం ద్వారా ఇది సామాన్యుడికి సైతం విమానయాన సౌకర్యం అందించిన వ్యక్తి కథ అని అర్థం అవుతోంది. 4 కోట్లు పెట్టి విమానం కొని టికెట్ ధర ఒక్క రూపాయి పెట్టి అందరూ విమాన ప్రయాణం చేయడానికి హీరో సంకల్పించినట్లు చూపించారు. దీని కోసం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో ఒక సక్సెస్ ఫుల్ మ్యాన్ అనిపించుకున్నాడు అనేది ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే సూర్య మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారక్టర్ ప్లే చేసాడని అర్థం అవుతోంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మోహన్ బాబు – జాకీష్రాఫ్ – పరేష్ రావల్ – ఊర్వశి – కరుణాస్ – వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ గునీత్ మోంగా మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.Source link

www.tupaki.com