డిస్కోరాజా డింకీ కొట్టినా రవితేజ మళ్ళీ అదే!డిస్కోరాజా డింకీ కొట్టినా రవితేజ మళ్ళీ అదే!

డిస్కో రాజా చిత్రంలో ఎనభైవ దశకం బ్యాక్ డ్రాప్ లో డాన్ గా కనిపించాడు రవితేజ. ఆ చిత్రం పాయింట్ బాగున్నా కానీ బాడ్ స్క్రీన్ ప్లే వల్ల క్లిక్ అవలేదు. అయితే ఆ నేపథ్యంలో బలం ఉందని, సరిగ్గా చేస్తే తప్పకుండా ఆడుతుందని రవితేజ నమ్మకం. తాను కొన్ని మార్పులు చెప్తే ఆ చిత్ర దర్శకుడు ఆనంద్ అమలు చేయలేదట. అందుకే డిస్కో రాజా ఫెయిల్ అయిందని తెలియగానే రవితేజ ఇక ఆ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఇప్పుడు త్రినాధరావు నక్కిన రవితేజ దగ్గరకి మళ్ళీ అదే నేపథ్యం ఉన్న కథ తీసుకుని వెళ్ళాడట. కథ విన్న రవితేజ కొన్ని మార్పులు చెప్తే అవి అమలు చేస్తానని చెప్పాడట. దాంతో రవితేజ ఆ చిత్రం ఓకే చేసేసాడు. ఈసారి రవితేజ ఆ కాలంలో ఎలా కనిపించాలని అనుకున్నాడో అలా కనిపిస్తాడన్న మాట. అన్నట్టు త్రినాధరావు సక్సెస్ లో కీలకమైన రచయిత ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి పనిచేయడం లేదట.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *