డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఆ లేడీ యాంకర్

Movie NewsTelugu anchor caught on Drunk And Drive

వీకెండ్ వచ్చేసింది. సాఫ్ట్ వేర్ కొలువులకు శని ఆదివారాలు సెలవు.. ఈ మధ్య
బ్యాంకులకు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ లోని మెజార్టీ కార్పొరేట్
కంపెనీలన్నీ కూడా వీకెండ్ ఉద్యోగులు సేదతీరడానికి సెలవులు ఇచ్చేస్తున్నాయి.
ఇంకేమందు శుక్రవారం గడిచిందా ఇక పండుగే.. చాలా మందికి వీకెండ్ ను గొప్పగా
సెలెబ్రేట్ చేసుకుంటారు. హైదరాబాద్ లాంటి మహా నగరం లో అయితే ఆ జోష్
మామూలుగా ఉండదు..

తాజాగా హైదరాబాద్ లో బడాబాబులకు నిలయమైన
బంజారాహిల్స్ లో పోలీసులు శుక్రవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐదుగురు యువతులు ఫుల్లుగా మద్యం తాగి
పట్టుబడ్డారు. వీరేకాదు.. ఏకంగా నిన్న ఒక్క రాత్రియే మద్యం తాగి వాహనాలు
నడిపిన 103మందిపై కేసులు నమోదు చేశారు. దాదాపు 43 కార్లు 60 బైక్ లను
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా పట్టుబడ్డ ఐదుగురు యువతులలో
ఒక ప్రముఖ యాంకర్ కూడా ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం. మరి లీక్ చేయకుండా
రహస్యంగా ఉంచిన ఆ యాంకర్ ఎవరు? ఎంత మొత్తంలో తాగింది.. ఏలా హల్ చల్
చేసిందనేది ఆసక్తిగా మారింది. పోలీసులు అధికారికంగా స్పందించే వరకు ఆ
యాంకర్ ఎవరనేది మనకు తెలియదు..Source link

Leave a Reply