డ్రగ్స్ కేసు అప్పుడే తొక్కేసే ప్లాన్ జరిగిందా?

Movie NewsBollywood Drugs Case

టాలీవుడ్ లో అగ్రనటుల నుంచి అగ్ర దర్శకుల వరకు డ్రగ్స్ లింకు ఉన్న వారందరినీ విచారించి అప్పట్లో తెగ హల్ చల్ చేశారు. కట్ చేస్తే విచారణ అధికారి డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లాడు. ఆ డ్రగ్స్ కేసులో అసలు ఏ సినీ ప్రముఖుడికి లింక్ లేదని.. డ్రగ్స్ సరఫరాదారులే నిందితులని తేల్చారు. ఇలా టాలీవుడ్ లో తొక్కేసినట్టే బాలీవుడ్ లో కూడా సుశాంత్ చుట్టూ తవ్వుతున్న డ్రగ్స్ కేసును కూడా తొక్కేస్తున్నారన్న అనుమానాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

భారత్ లో డ్రగ్స్ కేసు వేటికి తీసిపోదని అంటున్నారు. పొరుగు దేశం అయిన పాకిస్తాన్ తో ఎవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై వెలికి తీస్తారేమో అని భారతీయులు అంతా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తూ ఉంటే.. అప్పుడే ఈ కేసును తొక్కేసే ప్లాన్ జరుగుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్ కి డ్రగ్స్ కి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ చెప్తూ ఉంది. అంటే దీనివెనుక ఏదో జరుగుతోందని అనిపిస్తోందని నెటిజన్లు అనుమానపడుతున్నారు.  
 
సుశాంత్ సంతకం.. రకుల్ సారా అలీఖాన్ వీళ్లు అంతా బాలీవుడ్ కాక ఇంకెవరు? డ్రగ్స్ లో పెద్ద తలకాయలు ఉన్నాయని అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు బయటకి లాగుతున్నారని అనుకుంటే తొక్కేసే ప్లాన్ జరిగిపోతోందని కేంద్ర హోంశాఖ ప్రకటన తర్వాత అందరూ అనుమానపడుతున్నారు.

కేవలం రాజకీయాలకు ఇవన్నీ వాడుకొని వాళ్ల పదవుల కోసం దేశం భవిష్యత్తుకు సంబంధించిన కేసులు కూడా తొక్కేసే కార్యక్రమాలు జరగడం అన్యాయం అని నెటిజన్లు అంటున్నారు. టాలీవుడ్ లో కూడా ఇలానే డ్రగ్స్ కేసుపై భారీగా విచారణ జరిపి తొక్కేశారని.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తొక్కేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.. Source link

www.tupaki.com

Leave a Reply