‘డ్రగ్స్ బానిసలైన పేదల గురించి ఎవరైనా ఆలోచించారా..?’

Movie News'Has anyone thought about the poor who are addicted to drugs ..?'

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో బయటకు వచ్చిన
డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో రంగంలోకి దిగిన
నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్పటికే హీరోయిన్ రియా
చక్రవర్తి తో పాటు డ్రగ్స్ తో సంబంధమున్న పలువురిని అరెస్ట్ చేసి
విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్సీబీ విచారణలో రియా అనేకమంది పేర్లు
వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ
చూసినా డ్రగ్ మాఫియా గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్టార్
హీరోయిన్ కంగనా రనౌత్ బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్
తీసుకుంటారని సంచలన కామెంట్స్ చేసింది. ఇక ఈ విషయంపై పార్లమెంటు లో కూడా
చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్ నటి పూజా భట్ ఆసక్తికర ట్వీట్
చేసింది.

పూజా భట్ ట్వీట్ చేస్తూ.. ”సొసైటీలో అట్టడుగు వర్గాలుగా
పరిగణింపబడుతూ.. బాధల నుంచి విముక్తి పొందేందుకు మత్తు పదార్థాలను
ఉపయోగించే ప్రజల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? కలలు ఆవిరైపోయి
పేదరికంలో మునిగి దుర్భర జీవితం గడుపుతున్న వాళ్ల బాగోగుల గురించి ఎవరైనా
ఆలోచించారా? వారి పునరావాసంపై ఆసక్తి కనబరిచారా?’’అని ప్రశ్నించారు. పూజా
ట్వీట్ కు సపోర్ట్ చేస్తూ కొందరు కామెంట్స్ పెడుతుంటే.. మరికొంత మంది ఆమెపై
ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ కేసులో ఆరోపణలు
ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి డైరెక్టర్ మహేష్ భట్ మద్దతుగా నిలిచారంటూ
వారిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పూజా భట్ –
అలియా భట్ లు నెపోటిజం కారణంగానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారంటూ కామెంట్స్
చేస్తూ వారి సినిమాలు బ్యాన్ చేయాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున నిరసన
తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల మహేష్ భట్ దర్శకత్వంలో పూజా భట్ – అలియా భట్ లు
నటించిన ”సడక్ 2” సినిమా వరస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా చేశారు.Source link

www.tupaki.com

Leave a Reply