తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న బిబి

Movie NewsBigg Boss Season 4 TRP Ratings New Record

బిగ్ బాస్ అనేది అన్ని భాషల్లో కూడా మంచి ఆధరణ దక్కించుకుంది. హిందీలో గత 13 ఏళ్లుగా టాప్ రేటింగ్ షో గా నిలుస్తుంది. ఇక సౌత్ లో కూడా బిగ్ బాస్ కు అదిరిపోయే రేటింగ్ దక్కింది. తెలుగు మరియు తమిళంలో మొదటి మూడు సీజన్ లకు మంచి రేటింగ్ దక్కడంతో కరోనా సమయంలోనూ తెలుగు బిగ్ బాస్ ను మొదలు పెట్టారు. తమిళంలో మరికొన్ని రోజుల్లో ప్రారంభించబోతున్నారు. ఇక ప్రారంభ ఎపిసోడ్ కు ఎప్పుడు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. కంటెస్టెంట్స్ ఎవరు అనే సస్పెన్స్ ఉంటుంది కనుక రేటింగ్ బాగా వస్తాయి.

గత మూడు సీజన్ లకు మొదటి ఎపిసోడ్స్ మరియు ఫైనల్ ఎపిసోడ్స్ కు భారీ రేటింగ్ వచ్చింది. గడచిన మూడు ఎపిసోడ్స్ తో పోల్చితే ఈసారి మరింత ఆసక్తికరంగా షో మొదటి ఎపిసోడ్ ఉండటంతో అత్యధికంగా రేటింగ్ దక్కింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేశాడు. మొదటి ఎపిసోడ్కు ఎన్టీఆర్ కారణంగా 16.18 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత నాని హోస్టింగ్ చేసిన రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ కు 15 రేటింగ్ దక్కింది.

నాగార్జున మొదటి ఎపిసోడ్ కు యావరేజ్ రేటింగ్ వచ్చింది. కాని ఈసీజన్ మొదటి ఎపిసోడ్ కు మాత్రం ఏకంగా 18.5 రేటింగ్ రావడం రికార్డుగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ రేటింగ్ తీసుకుంటే నిరాశ పర్చినా కూడా మొదటి ఎపిసోడ్ రేటింగ్ విషయంలో మాత్రం తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు తెలుగు బిగ్బాస్.Source link

www.tupaki.com

Leave a Reply