తెరపై కనిపించే వారి కంటే తెరవెనుక కష్టపడే వారే హ్యాపీగా ఉన్నారట…!Dubbing Artists Earning Huge Money During Lockdown

సినీ ఇండస్ట్రీలో గత నాలుగు నెలలుగా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవించే కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో రిలీజ్ కి సిద్ధమైన సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసే అవకాశాలు లేకపోవడంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీలలో తెలుగు కంటెంట్ తక్కువగా ఉంది. కొత్త సినిమాలు కూడా లేకపోవడంతో ఓటీటీలన్నీ ఇతర భాషల సినిమాలను వెబ్ సిరీస్ లను తెలుగులో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ క్రమంలో ‘ఫోరెన్సిక్’ ’36 వయసులో’ ‘జిప్సి’ ‘ఇంకా ఏమైనా’ ‘షైలాక్’ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలలో ప్రసారం అవుతున్నాయి. త్వరలో ‘మగువలు మాత్రమే’ అనే డబ్బింగ్ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. వీటిని జనాలు చూస్తారో లేదో అనేది పక్కన పెడితే ఈ డబ్బింగ్ సినిమాల వల్ల ఇండస్ట్రీలోని చాలామందికి ఉపాధి దొరుకుతోంది.

కాగా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న డబ్బింగ్ ఆర్టిస్టులకు.. డబ్బింగ్ స్టూడియోలకి.. ఎడిటింగ్ చేసే వాళ్ళకి.. వీఎఫెక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సినిమాల వల్ల పని లభిస్తోంది. తెరమీద కనిపించే నటీనటులకు వర్క్ లేకపోయినా తెరవెనుక ఉండే వారికి ఓటీటీల వల్ల కావాల్సినంత పని దొరుకుతోందని చెప్పవచ్చు. ఒకపక్క చిన్న హీరోలకు దర్శకులకు ఇతర నటీనటులకు కరోనా కష్టకాలంలో ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటే డబ్బింగ్ ఆర్టిస్ట్స్ టెక్నికల్ సిబ్బంది బాగానే సంపాదిస్తున్నారని సమాచారం. రోజు రోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న సమయంలో షూటింగు చేయడం కష్టంగా మారింది కానీ సినిమాలు డబ్బింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు కలగడం లేదు. అందుకే ఓటీటీలు ఇతర భాషాచిత్రాలను వెబ్ సిరీస్ లను తెలుగులో అనువాదం చేస్తున్నారు. దీంతో డబ్బింగ్ స్టూడియోలన్నీ బిజీగా మారిపోయాయి. మొత్తం మీద ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని ఇండస్ట్రీలో తెరపై కనిపించే వారి కంటే తెరవెనుక కష్టపడే వారే హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *