తెరపై ప్రముఖ పాప్ గాయని మడోనా బయోపిక్

Movie NewsMadonna to direct biopic about her life

ప్రతి ఇండస్ట్రీలోనూ బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ లో పలు క్రేజీ బయోపిక్ లు  సెట్స్ పై వున్నాయి. మరి కొన్ని చర్చల దశలో వున్నాయి. కొన్ని త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇదిలా వుంటే హాలీవుడ్ లోనూ బయోపిక్ ల హంగామా మొదలైనట్టు తెలుస్తోంది. హాలీవుడ్ పాప్ సింగర్ మదన మనోహరి మడోన్నా జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నారు.

ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మడోన్నా కుర్రాకారుకి కలల రాణి. నాటి తరం నుంచి నేటి తరం వరకు మడోన్నా అంటే ఇష్టపడని వారంటూ వుండరు. అలాంటి క్రేజీ పాప్ సింగర్ జీవిత కథని తెరపైకి తెస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది. అయితే ఈ బయోపిక్ కు మడోన్నానే దర్శకత్వం హించనుందట.

తనకంటే ఎవరు తన కథని బాగా చెప్పగలరు చెప్పండి అంటోంది ఈ హాట్ లేడీ. ఈ మూవీ ఫోకస్ మొత్తం మ్యూజిక్ చుట్టే వుంటుందట. సంగీతమే తనని నడిపించిందట. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలని ఈ మూవీలో ప్రస్తావించనుందట. ఫిల్త్ అండ్ విస్ డమ్.. డబ్ల్యూఇ చిత్రాలకు గతంలో మడోన్నా దర్శకత్వం వహించారు.Source link

www.tupaki.com

Leave a Reply