తెలంగాణలో అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

Movie NewsComplaint to police against Allu Arjun in Telangana

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఇటీవల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించారని ఆయనపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు.
 
ఇటీవల తెలంగాణ లోని కుంటాల జలపాతం సందర్శనకు వెళ్లిన అల్లు అర్జున్ పై పలువురు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ పోలీసు స్టేషన్  లో ఫిర్యాదు దాఖలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా.. ఇటీవల అల్లు అర్జున్ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తూ జలపాతాన్ని సందర్శించారు. అంతేకాకుండా తిప్పేశ్వర్లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు ఫిర్యాదు లో పేర్కొన్నారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ  అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఇదే విషయమై ఆదిలాబాద్ డీఎఫ్వో ప్రభాకర్కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లారు. ఆయన అందుబాటు లో లేక పోవడంతో ఆఫీస్ స్టాఫ్ కి వినతి పత్రం ఇచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప కొవిడ్ లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు షూటింగ్ నిలిచి పోయింది. ఈ మధ్యే షూటింగ్ లు జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వడం తో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.Source link

www.tupaki.com

Leave a Reply