దిల్‌ రాజు గ్యాంబ్లింగ్‌ వర్కవుట్‌ అయింది

Movie Newsదిల్‌ రాజు గ్యాంబ్లింగ్‌ వర్కవుట్‌ అయింది

సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్‌ అయితే అన్నిటి నైజాం పంపిణీ హక్కులని దిల్‌ రాజు కైవసం చేసుకున్నాడు. అతనికి ఆశ మరీ ఎక్కువ అయిపోతుందని అనుకున్నారు కానీ నిజానికి దిల్‌ రాజు గ్యాంబుల్‌ చేసాడు. నాలుగు సినిమాల్లో ఏది ఎంత రేంజ్‌లో క్లిక్‌ అయితే దానికి అనుగుణంగా థియేటర్లతో గేమ్‌ ఆడుకునేలా ప్లాన్‌ చేసి పెట్టుకున్నాడు. దర్బార్‌ సినిమా ముందుగా రిలీజ్‌ అయితే దానికి మొదటి రోజు మాగ్జిమం వసూలయ్యేలా చూసుకున్నాడు.

అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటి రోజున ఎంత పిండుకోవచ్చో అంత పిండేసుకున్నాడు. ‘అల వైకుంఠపురములో’ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి డామినేట్‌ చేయడం చూసి అందుకు అనుగుణంగా దానికి స్క్రీన్లు పెంచేసాడు. అలాగే ‘ఎంత మంచివాడవురా’ చిత్రం మొదటి రోజున వెనకబడకుండా చూసుకున్నాడు. ఈ నాలుగు సినిమాలలో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు దిల్‌ రాజుకి బెనిఫిట్‌ చేయగా, మిగతా రెండు సినిమాలు వీటి థియేటర్లు ఆక్రమించకుండా చూసుకోగలిగాడు.

అల వైకుంఠపురములోపై భారీ లాభాలు చవిచూడనున్న దిల్‌ రాజుకి సరిలేరు నీకెవ్వరు కూడా హ్యాపీ ప్రాజెక్ట్‌ అవుతుంది. రెండు పెద్ద సినిమాలు వర్కవుట్‌ అయినపుడు మిగతా సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా వచ్చే నష్టం లేదు. మొత్తానికి నాలుగు సినిమాలు కొనేసి రిస్కు చేసిన దిల్‌ రాజు ఇప్పుడు తన స్ట్రాటజీతో ఇండస్ట్రీలో అందరి మన్ననలు అందుకుంటున్నాడు.Source link

Leave a Reply