‘దృశ్యం’ దర్శకుడికి తీవ్ర అస్వస్థత

Movie NewsPopular Filmmaker Hospitalised In Critical Condition

మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు అందించిన దర్శకుడు నిషికాంత్ కమల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నారట. గతంలోనే ఆయనకు లివర్ సంబంధిత సమస్య ఉంది. ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన కోలుకున్నారు. మళ్లీ ఇప్పుడు తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన దర్శకుడు నిషికాంత్ 2005 సంవత్సరంలో మరాఠీ చిత్రంతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దృశ్యం రీమేక్ ను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కించి అక్కడ కూడా సక్సెస్ కొట్టాడు. బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లకు ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ వర్క్ చేసిన నిషికాంత్ ప్రస్తుతం హర్షవర్ధన్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

2022లో ఆ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్ కు గత కొన్ని నెలలుగా అంతరాయం కలిగింది. ఈ సమయంలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడంతో బాలీవుడ్ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నట్లుగా వైధ్యులు చెప్పడంతో ఆయన సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Source link

Leave a Reply