దేవరకొండ కోరుకున్నది జరగట్లేదా?



దేవరకొండ కోరుకున్నది జరగట్లేదా?

విజయ్ దేవరకొండ సినిమా విడుదలవుతోందంటే ఉండే హంగామానే వేరు. ‘అర్జున్
రెడ్డి’ దగ్గర్నుంచి అతడి సినిమాల పట్ల జనాల ఆసక్తే వేరుగా ఉంటోంది. ప్రతి
సినిమా విడుదల ముంగిట హంగామా కనిపిస్తుంటుంది. ఫ్లాప్ అయిన ‘నోటా’, ‘డియర్
కామ్రేడ్’ సినిమాలకు కూడా ఇలాంటి హంగామానే కనిపించింది. కానీ విజయ్ నుంచి
వస్తున్న కొత్త చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయంలో మాత్రం అలాంటి హడావుడి
ఏమీ కనిపించడం లేదు.

ముందు నుంచి ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు
నెగెటివ్ ఒపీనియన్‌తోనే ఉన్నారు. దీని టీజర్, ట్రైలర్ బాగానే అనిపించినా..
విజయ్ గత హిట్ల మాదిరి ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకాలు లేవు. ఈ
సినిమాతో ముడిపడ్డ అందరూ ఫ్లాపుల్లో ఉండటం ఇందుకు ఒక కారణం కావచ్చేమో.

‘వరల్డ్
ఫేమస్ లవర్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తన సినిమాలు
రిలీజయ్యే ముందు జనాల్లో ఒక హిస్టీరియా కనిపిస్తుందని.. ఈసారి విజయ్ ఏం
సినిమా చేశాడు.. ఇందులో ఏముంది అనే క్యూరియాసిటీ ఉంటుందని.. ఒక హైప్
ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇదంతా తాను వినమ్రంగానే చెప్పుకుంటున్నట్లు
తెలిపాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయంలో ఇంతకుముందు వరకు ఈ హడావుడి లేదన్న
సంకేతాలు అతను ఇచ్చాడు. ట్రైలర్ రిలీజయ్యే కథ వేరుగా ఉంటుందని అన్నాడు.
కానీ ట్రైలర్‌ విషయంలో జనాల స్పందన రకరకాలుగా ఉండగా.. విజయ్ కోరుకున్న
హిస్టీరియా అయితే కనిపించడం లేదు.

ఈ నెల 9న ప్రి రిలీజ్ ఈవెంట్లో
విజయ్ కొంచెం ఎక్కువ హంగామా చేసి హైప్ తీసుకొస్తాడేమో చూడాలి కానీ..
ప్రస్తుతానికైతే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయంలో జనాలు ఒక అంచనాకు
రాలేకపోతున్నారు. విజయ్ గత సినిమాల మాదిరి దీనికి హైప్ అయితే లేదు. చూద్దాం
మరి ఫిబ్రవరి 14న ఈ సిినిమాకు ఎలాంటి టాక్, ఓపెనింగ్స్ వస్తాయో.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *