నాని `జెర్సీ`కి అరుదైన అంతర్జాతీయ గౌరవంRare international honor for Nani Jersey

2019-20 లో ప్రదర్శితమై క్రిటిక్స్ ప్రశంసలు పొందిన దేశీయ కమర్షియల్ హిట్ చిత్రాలకు ఆస్ట్రేలియా టొరొంటో అంతర్జాతీయ ఉత్సవాల్లో అరుదైన గౌరవం దక్కనుంది. ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ 8వ ఎడిషన్ ఆగస్టు 9 నుండి 15 వరకు జరగనుంది. ఈ సంవత్సరం పండుగలో భాగంగా తెలుగు- తమిళం- మలయాళం- హిందీ నుండి విమర్శకుల ప్రశంసలు పొందిన .. వాణిజ్యపరంగా విజయవంతమైన నాలుగు సినిమాలు ప్రదర్శించనున్నారు.

నాని నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` సహా సౌత్ నుంచి పలు చిత్రాలు ఇక్కడ ప్రదర్శనకు అర్హత సాధించాయి. కార్తీ- ఖైదీ (కైతి).. ఫహద్ ఫాజిల్ `ట్రాన్స్` .. హృతిక్ రోషన్ `సూపర్ 30` ఈ ఉత్సవంలో స్క్రీనింగ్ కోసం ఎంపికయ్యాయి. ఇవన్నీ ఏడాదిలోపు విడుదలైనవి. ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసే అద్భుత కథాంశాలతో స్టార్ల అద్భుత నటప్రదర్శనతో మెప్పించిన చిత్రాలుగా టాక్ తెచ్చుకున్నవే ఇవన్నీ. అందుకే ఈ అంతర్జాతీయ సినిమా పండగలో అరుదైన గౌరవం అందుకుంటున్నాయి.

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన `జెర్సీ` క్రిటిక్స్ మనసు దోచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గానూ లాంగ్ రన్ లో చక్కని వసూళ్లు సాధించిందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. నేచురల్ స్టార్ నటనకు పేరొచ్చింది. నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కి గొప్ప గుర్తింపు దక్కింది. జెర్సీ ప్రస్తుతం హిందీ.. తమిళంలో రీమేకవుతున్న సంగతి తెలిసిందే.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *