నా మొదటి విజయానికి గుర్తు దాన్ని నేను ఎలా అమ్ముతాను?



Bheeshma Director Plays It Smart

భీష్మ చిత్రంతో నేడు వెంకీ కుడుముల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఛలోతో
సక్సెస్ కొట్టిన వెంకీ భీష్మతో కూడా కంటిన్యూ చేసినట్లుగానే అనిపిస్తుంది.
సినిమాకు అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు
వెంకీ మొదటి సినిమా హీరో నాగశౌర్యతో సరిగా ఉండటం లేదు. వీరిద్దరి మద్య
కారణం ఏంటో కాని సైలెంట్ వార్ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం వెంకీ
కనీసం విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటూ నాగశౌర్య సంచలన కామెంట్స్
చేశాడు.

ఛలో సినిమా సక్సెస్ అయినందుకు తాను వెంకీకి కారును
బహుమానంగా ఇస్తే దాన్ని అమ్మేశాడు. ప్రస్తుతం ఆయన వేరే కారులో
తిరుగుతున్నాడు అంటూ శౌర్య విమర్శలు గుప్పించాడు. నా ఫోన్ ఎత్తక పోవడంతో
పాటు కాస్త దురుసుగా ప్రవర్తించాడు అంటూ శౌర్య ఆరోపించాడు. భీష్మ ప్రమోషన్
లో భాగంగా నాగశౌర్య కామెంట్స్ కు వెంకీ స్పందించాడు. శౌర్య ఇచ్చిన కారును
అమ్మేయడానికి కారణం ఏంటని.. ఇద్దరి మద్య విభేదాలకు కారణం ఏంటీ అంటూ
వెంకీని మీడియా ప్రశ్నించింది.

ఆ ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం
చెప్పాడు. నా మొదటి సినిమా సక్సెస్ గుర్తు ఆ కారు. నేను దాన్ని అమ్ముతాను
అని ఎలా అనుకున్నారు. అది నాకు జీవితాంతం కూడా తీపి గుర్తుగా ఉంటుందని
చెప్పాడు. కాని ఆ కారులో మాత్రం తిరగను అన్నట్లుగా మాట్లాడాడు. కారును
అయితే అలాగే ఉంచుకుంటాడు కాని తిరిగే విషయమై మాట్లాడలేదు. నాగశౌర్య గురించి
ఇంకా డెప్త్ గా అడిగేందుకు ప్రయత్నించగా ఆయన టాపిక్ డైవర్ట్ చేశాడు. ఇంతకు వీరిద్దరి మద్య వైరం ఎందుకు అనేది మాత్రం ఎవరు చెప్పలేక పోతున్నారు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *