పవన్‌కళ్యాణ్‌కి పెద్ద పనే పెట్టారు!

Movie Newsపవన్‌కళ్యాణ్‌కి పెద్ద పనే పెట్టారు!

పవన్‌కళ్యాణ్‌ పింక్‌ రీమేక్‌ కాన్సిల్‌ అవ్వాలంటూ చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు కానీ అది జరగడం లేదు. ఈ చిత్రం షూటింగ్‌ మరో రెండు రోజుల్లో మొదలు కానుంది. ముందుగా లేడీస్‌పై సీన్స్‌ తీస్తారని అనుకుంటే పవన్‌కళ్యాణ్‌తోనే మొదటి షెడ్యూల్‌ చేయడం విశేషంగా వినిపిస్తోంది. ఏదో కోర్ట్‌ రూమ్‌లో సన్నివేశాలతో కాలక్షేపం చేయనివ్వకుండా సరాసరి ఒక యాక్షన్‌ సీన్‌తో పవన్‌కి పెద్ద పనే పెడుతున్నారు.

తమిళ పింక్‌ రీమేక్‌లో అజిత్‌ కుమార్‌పై తీసిన పార్క్‌ ఫైట్‌ సీన్‌ ముందుగా చిత్రీకరించబోతున్నారు. తమిళ చిత్రానికి ఆ ఫైట్‌ చాలా ప్రత్యేకంగా నిలవడంతో తెలుగు వెర్షన్‌లోను ఈ ఫైట్‌ సీన్‌ని చాలా కీలకంగా భావిస్తున్నారు. ఫైట్స్‌ చేయడంలో పవన్‌ది ప్రత్యేక శైలి కనుక ఇందులో వుండే ఈ ఒకే ఒక్క ఫైట్‌ చాలా స్పెషల్‌గా డిజైన్‌ చేసారు. ఇందులో పవన్‌ సరసన అతిథి పాత్రలో కనిపించే హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఆమెతో పాటు పవన్‌కి ఒక పాట కూడా వుంటుంది.

ఆ పాటని స్వరపరిచే పనిలో తమన్‌ నిమగ్నమయ్యాడు. ముందుగా అవుట్‌ డోర్‌కి సంబంధించిన సీన్లు చిత్రీకరించిన తర్వాత కోర్ట్‌ సీన్లు తీస్తారట. ఈ చిత్రాన్ని మే నెలాఖరులో విడుదల చేసేలా దిల్‌ రాజు ప్రణాళిక వేసుకున్నాడు. ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ లేవు కనుక ఇదొక్కటే అగ్ర హీరో సినిమా అవుతుందని, అందుకని భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయని దిల్‌ రాజు నమ్ముతున్నాడు.Source link

Leave a Reply