పవన్ ఎనిమిది రోజులిస్తే చాలు..



పవన్ ఎనిమిది రోజులిస్తే చాలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఈపాటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లాల్సింది. ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా మొదలైన కొన్ని రోజులకే నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్లానింగ్‌కు తగ్గట్లే షూటింగ్ ముందుకు సాగింది కూడా. పవన్ వరుసగా ఈ సినిమాకు డేట్లు కేటాయించి చకచకా షూటింగ్ పూర్తయ్యేలా చూశాడు.

ఐతే అంతా ప్రణాళిక ప్రకారం సాగిపోతుండగా.. కరోనా మహమ్మారి వచ్చి అడ్డం పడింది. చిత్రీకరణకు బ్రేక్ వేసింది. దీంతో చేసేది లేక చిత్ర బృందం సైలెంటుగా ఉంది. మేలో అసలు థియేటర్లే తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. షూటింగ్ కూడా పెండింగ్ ఉంది కాబట్టి ‘వకీల్ సాబ్’ ఇప్పుడిప్పుడే రిలీజయ్యేలా లేదు. కొందరేమో ‘వకీల్ సాబ్’ దసరాకు వాయిదా పడ్డట్లు ప్రచారం చేస్తున్నారు.

ఐతే దిల్ రాజు ఆలోచన అలా ఏమీ లేదట. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు జూన్ నెలాఖరు వరకు థియేటర్లు మూతపడే ఉంటే.. ఆగస్టు 15కు ‘వకీల్ సాబ్’ను ప్లాన్ చేయాలని దిల్ రాజు యోచిస్తున్నట్లు సమాచారం. థియేటర్లు వెంటనే తెరుచుకోకున్నా.. మే లేదా జూన్‌లో షూటింగులు మాత్రం కచ్చితంగా పున:ప్రారంభం అవుతాయని.. మిగిలిన భాగం చిత్రీకరణకు గరిష్టంగా నెల రోజులు మాత్రమే సమయం పడుతుందని చిత్ర బృందం భావిస్తోందట.

పవన్ కేవలం 8 రోజుల డేట్లు కేటాయిస్తే చాలు.. ఆయన పని పూర్తవుతుందట. మిగతా నటీనటులతో ముడిపడ్డ సన్నివేశాల్ని కూడా వేగంగా పూర్తి చేసి.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి.. స్వాతంత్ర దినోత్సవ కానుకగా సినిమాను రిలీజ్ చేద్దామని రాజు అండ్ కో భావిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ సామాజిక అంశాలతో ముడిపడ్డ కథ కూడా కావడంతో ఆగస్టు 15కు ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారట.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *