పవన్ కళ్యాణ్ కొత్త మూవీ టైటిల్ కెవ్వు కేకలే

Movie NewsPawan Kalyan new movie title

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ ఎంపిక సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. గబ్బర్ సింగ్ .. సర్ధార్ గబ్బర్ సింగ్.. పంజా .. కొమరం పులి.. ఇవన్నీ పవర్ ఫుల్ టైటిల్స్. జనంలోకి సులువుగా దూసుకుపోయిన టైటిల్స్ కూడా. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే టైటిల్ తోనూ మరోసారి జనంలోకి దూసుకెళ్లాడు.

ఈ మూవీ తర్వాత ఎక్స్ క్లూజివ్ టైటిల్ సెలెక్షన్ తో ఆకట్టుకుంటున్నాడు పవన్. ప్రస్తుతం పవన్ మల్లూ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ లో పోలీస్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని విజయదశమి సందర్భంగా అధికారికంగా లాంచ్ చేశారు. అయితే టైటిల్ ని మాత్రం వెల్లడించలేదు.

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. ఈ మూవీ టైటిల్ కెవ్వు కేక రేంజులో ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాగా పాపులరైన క్లాసిక్ టైటిల్ `బిల్లా రంగా` ను ఎంపిక చేశారని వినిపిస్తోంది. ఇక బిల్లా రంగా అంటే రెండు పాత్రలు కదా?  ఆ రెండో పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? అంటే దగ్గుబాటి రానా పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రానాను దర్శకనిర్మాతలు సంప్రదించారట. అయితే అధికారికంగా ప్రతిదీ చిత్రబృందం వెల్లడించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది.  మే 2021 లో విడుదల చేయాలన్నది ప్లాన్.

ఈ చిత్రం మొత్తం షూట్ పొల్లాచిలో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఇతర నటులు  సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది.  సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. వకీల్ సాబ్ చిత్రీకరణ ఈ నవంబర్ లో ముగించి తదుపరి క్రిష్ మూవీ సెట్స్ లో జాయిన్ అవుతాడు. అటుపై బిల్లా రంగా చిత్రీకరణను ప్లాన్ చేస్తారట.Source link

www.tupaki.com