పిక్ టాక్ : పెళ్లి పీఠలు ఎక్కిన సెక్సీబాంబ్

Movie NewsPoonam Pandey Getting Ready For Her Marriage

సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చాలా కాలం పాటు సోషల్ మీడియాలో సంచలన వీడియోలు ఫొటోలు షేర్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించిన పూనం తాజాగా ప్రియుడు సామ్ బాంబేను వివాహం చేసుకుని ఆ ఫొటోలను షేర్ చేసింది.

ఇన్నాళ్లు చాలా హాట్ కాస్ట్యూమ్స్ లో ఆమెను చూసిన జనాలు పెళ్లిలో ఆమెను ఫుల్ డ్రస్ లో చూసి వావ్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్ ఆమె పెళ్లి ఫొటోలపై బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా చూడటం కాస్త ఇబ్బందిగా ఉన్నా చాలా బాగున్నారు. మీరు కొత్త జీవితంలో అడుగు పెట్టారు. అంతా బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఆమెకు కామెంట్స్ పెట్టారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మళ్లీ సినిమాల్లో నటించే ఆసక్తితో ఉంది. కాని ఆఫర్లు వచ్చేది రానిది తెలియాల్సి ఉంది.Source link

www.tupaki.com

Leave a Reply