పునర్నవి అందాల మోత అందుకేనా?Bigg Boss Beauty Punarnavi Hot Yoga Pose

తెలుగు లో గతం లో హాటు భామలు తక్కువే ఉండేవారు. కానీ మారిన కాలంతో పాటు
హాటు భామల సంఖ్య పెరుగుతోంది. ట్రెడిషనల్ గా ఉండే భామలు కూడా హాటు రాగం
ఘాటు తాళంతో సోషల్ మీడియాకు సమ్మర్ తెప్పిస్తున్నారు. ఈ గ్లామర్ ఉద్యమంలో
పునర్నవి భూపాలం కూడా జాయిన్ అయింది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్ కు
నటిగా పరిచయం అయింది పునర్నవి. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది
కానీ చెప్పుకోదగ్గ బ్రేక్ అయితే రాలేదు. పోయినేడాది బిగ్ బాస్ 3 లో
పాల్గొనడంతో పునర్నవి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారింది.

పునర్నవికి
మొదటినుంచి హాట్ ఇమేజ్ ఏమీ లేదు. పక్కింటమ్మాయి తరహా గుర్తింపు ఉండేది.
కానీ బిగ్ బాస్ లో రాహుల్ సిప్లిగంజ్ తో చిలిపి గొడవలు పెట్టుకుని అందరికీ
సర్ప్రైజ్ ఇచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి
గ్లామర్ గేర్ వేస్తూ తన ఇమేజ్ పూర్తిగా మార్చుకునే పనిలో పడింది. ఈ
ప్రయత్నాలు సినిమా అవకాశాల కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
కదా. గ్లామర్ షోలతో ఫిలిం మేకర్ల దృష్టిని ఆకర్షిస్తేనే ఎవరికైనా అవకాశాలు
వస్తాయి. ప్రస్తుతం పునర్నవి కూడా అదే రూటు ఫాలో అవుతూ యోగాసనాల ఫోటో షూట్
చేసింది. కాల్విన్ క్లెయిన్ అంటే ఎప్పుడూ దిశా పటాని అనుకుంటారు.. నేనేం
తక్కువ అనుకుందేమో కానీ కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ తో కూడా
పోజులిచ్చింది. అయితే ఈ భామ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఇన్నర్ వేర్
ఫోటోషూట్లకు సూపర్ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం.

పునర్నవి ఎంత
ఘాటుగా ఫోటో షూట్లు చేసినా.. అందాలు ఆరబోసినా ఫిలిం మేకర్లు మాత్రం పెద్దగా
పట్టించుకోవడం లేదు. అసలు బిగ్ బాస్ లో ఎవరైనా పాల్గొన్నారు అంటేనే
‘అవుట్ డేటెడ్ యాక్టర్స్’ అనే ఒక బలమైన అభిప్రాయం ఉంది. తెలుగు బిగ్ బాస్
నుంచి బయటకు వచ్చి కెరీర్ లో ఎదిగినవారు ఉన్నత స్థాయికి చేరుకున్నవారు
ఒక్కరు కూడా లేరు. ఈలెక్కన పునర్నవి సీరియల్స్ తోనే సరి పెట్టుకోక
తప్పేలా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *