పెద్ద బ్యానర్ల కు కష్టమేనా..?Tough Time For Big Producers In Tollywood

ఏ బిజినెస్ అయినా రొటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది.. రొటేషన్ ఆగకుండా ఉంటే చాలు ఎంత పెట్టుబడి అయినా పెడతారు.  సినిమా ఇండస్ట్రీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.  అయితే గత మూడు నెలలుగా  ఇవన్నీ సినీ పరిశ్రమ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది.  ఒకవైపు సినిమా షూటింగులు ఆగిపోయాయి.. మరో వైపు థియేటర్లు మూత పడ్డాయి.  దీంతో  సినిమా రిలీజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.  

మన నిర్మాతలలో ఎక్కువమందికి థియేటర్ల లీజులు ఉండడంతో వాటిపై వచ్చే ఆదాయం రొటేషన్ కు ముఖ్యం.  అయితే థియేటర్లు మూత పడడంతో ఆదాయం ఆగిపోయింది. ఇక పెద్ద బ్యానర్లు దాదాపు అన్నీ ఒకే సమయంలో మూడు నాలుగు ప్రాజెక్టులు టేకప్ చెయ్యడంతో వాటిని కొనసాగించడం ఇబ్బందిగా ఉందట.  గీతా ఆర్ట్స్ వారు నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు.  అన్నీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ కూడా అదే సిట్యుయేషన్ లో ఉంది.  ఎక్కువ శాతం పెట్టుబడి ప్రొడక్షన్ లో ఇరుక్కుపోయింది.  ఇక సురేష్ ప్రొడక్షన్స్ వారు కూడా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు.  ఆసియన్ పిక్చర్స్ వారికి సెట్స్ మీద సినిమాలు ఉన్నాయి.  

ఇలా పెద్ద బ్యానర్లలో సినిమాలకు కొత్తగా పెట్టుబడి సమకూర్చడం కష్టంగా ఉందట.  ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులను ఎలాగో పూర్తి  చేసినప్పటికీ ప్లానింగ్ లో ఉన్న సినిమాలు మాత్రం కొన్ని అటకెక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు. Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *