పెద్ద సినిమాలు కూడా ఓటిటి విడుదలకు సిద్ధం అవ్వాలి: గిల్డ్ ప్రొడ్యూసర్స్Larger films should also be prepared for the release of OTT: Guild Producers

కరోనా వైరస్ కారణంగా చాలామంది దర్శక నిర్మాతలు థియేట్రికల్ విడుదల గురించి
అలోచించకుండా డిజిటల్ విడుదల కోసం రెడీ అవుతున్నారు. ఇదే కోవలో తాజాగా
అమితాబ్ బచ్చన్ ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన గులాబో సీతాబో సినిమాను జూన్
12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు షూజిత్
సిర్కార్ తెరకెక్కించారు. అయితే ఈ గులాబో సితాబో సినిమా ఓటిటి విడుదల పై..
ఇటీవలే సినిమా పేరు పెట్టకుండా ఐనాక్స్ స్పందించి.. అలా విడుదల చేస్తే
కొన్ని అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా
హెచ్చరించడంతో.. బాలీవుడ్ గిల్డ్ ప్రొడ్యూసర్లు కదిలి స్పందిస్తున్నారు.

వారు
స్పందిస్తూ.. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల యాజమానులకు ఇలాంటి కష్ట
సమయాలలో తట్టుకొని నిలబడడానికి.. అవసరం అయితే వారికి అండగా సినీ నిర్మాతలు
నిలబడాల్సిన అవసరం ఉందని.. గిల్డ్ బలమైన కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే
ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు నష్టాలతో బాధపడుతున్నారని.. వారంతా తమ
పెట్టుబడిని తిరిగి తీసుకుంటేనే భవిష్యత్తులో థియేట్రికల్ విడుదల కోసం
ఖర్చు చేయడానికి వీలుంటుందని గిల్డ్ తెలిపింది. అదీగాక మల్టీప్లెక్స్
యజమానులు ఇస్తున్న పనికిరాని హెచ్చరికలకు నిర్మాతల గిల్డ్ ఓ మినహాయింపు
కూడా ఇచ్చింది. కానీ థియేటర్లు ఓపెన్ కావడానికి చాలా సమయం పడుతుందని..
అంతేగాక కోవిడ్-19 మహమ్మారి కారణంగా థియేటర్లు తెరిచినా కూడా ఆక్యుపెన్సీ
రేటు చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.

అదే జరిగితే.. విదేశీ
సినిమాల మార్కెట్ కూడా కుప్పకూలిపోతుందని.. చిన్న బడ్జెట్ సినిమాల దుస్థితి
ఇంకా ఘోరంగా మారుతుందని తెలిపారు. అంతవరకు కాస్త నష్టాల భారాన్ని
తగ్గించడానికి.. కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లో విడుదల అవ్వాల్సిన అవసరం
ఉందని.. అవి నిర్మాతలను అప్పుల వైపు మళ్లకుండా కాపాడుతాయని చెప్పారు. ఇక
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇచ్చిన క్లారిటీతో.. ఇంకా చాలా పెద్ద బాలీవుడ్
సినిమాలు ఓటిటిలో విడుదల అవుతాయని స్పష్టమైంది. ఇప్పటికే విద్యాబాలన్
నటించిన ‘శకుంతలదేవి’ అక్షయ్ కుమార్ ‘లక్ష్మిబాంబ్’ సినిమాలు ఆల్రెడీ
ఓటిటి విడుదలకు సిద్దమైనట్లు తెలిసిందే!Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *