పెళ్లి పాయె సినిమాలు పాయె డాం డాం!

Movie NewsShweta Basu Prasad and Rohit Mittal file for divorce

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది బాలీవుడ్
బ్యూటీ శ్వేత బసు ప్రసాద్. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో అప్పట్లో
మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో ఓ
సెక్స్ స్కాండల్ లో శ్వేత పేరు బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఈ హంగామా
పూర్తయిన తర్వాత హిందీ సీరియల్స్ తో బిజీ అయిపోయింది. హిందీలో సినిమాలు
కూడా చేసింది. ఆ తర్వాత ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ను ప్రేమించి
పెళ్ళాడింది. అయితే ఏడాదిలోపే తర్వాత విడాకులు తీసుకుని సింగిల్ గా
మారిపోయింది.

అయితే ఈ మెరుగైన సమాజంలో.. ఆధునిక భావాలు
రాజ్యమేలుతున్న ఈ అంతర్జాల తరంలో బ్రేకప్ అనేది చాలాచాలా కామన్. అందుకే ఆ
పాస్ట్ ను పక్కనబెట్టి బికినీ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ
న్యూ జెనరేషన్ భామ అనిపించుకుంటోంది. గత మూడేళ్లలో కాలంలో శ్వేత బసు
‘బద్రినాథ్ కి దుల్హనియా’.. ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’.. ‘ది తాష్కెంట్
ఫైల్స్’ సినిమాలలో నటించింది. తన చివరి చిత్తరం ‘ది తాష్కెంట్ ఫైల్స్’
పోయినేడాది రిలీజ్ అయింది. ఆ తర్వాత శ్వేత చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు.
ఇటు టాలీవుడ్ లో ఆఫర్లు లేవు. అటు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం లేదు.

దీంతో
శ్వేత బసు హాట్ ఫోటోల ఉత్సవాలు చేస్తోంది. ఈ ఫోటోలను ఆస్వాదించే
కళాపోషకులు కొందరైతే.. సెటైర్లు వేసే వెటకారులు కొందరు పెళ్లి పాయె
సినిమాలు పాయె డాం డాం అంటూ పంచ్ వేస్తున్నారు. అయినా ముంబై పాప కదా
ఇలాంటివి ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకొన్ని హాట్ ఫోటోలను అప్లోడ్
చేస్తుంది. విమర్శకుల ఒంట్లో వేడి పెరుగుతుంది. పంచ్ కి పంచ్ కదా?Source link

Leave a Reply