ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహం

Movie NewsStar hero Prabhas disappointed the fans again

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ఫ్యాన్స్ గత ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి… సాహోల సినిమాల స్థాయిలో ఈసినిమాను దర్శకుడు రాధాకృష్ణ చెక్కుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ వారిని ఒత్తిడి చేసి మరీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేలా చేశారు.

ఇక ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్బంగా రాధేశ్యామ్ టీజర్ వస్తుందని అంతా ఆశించారు. ఒక్క రోజు ముందు ఆర్ఆర్ఆర్ మూవీ నుండి రామరాజు ఫర్ భీమ్ ప్రోమో విడుదల అయ్యింది. దాంతో రాధేశ్యామ్ టీజర్ కూడా విడుదల అవ్వడం ఖాయం అనుకుంటే యూనిట్ సభ్యులు మాత్రం నిరాశ పర్చారు.

కేవలం మోషన్ పోస్టర్ ను విడుదల చేసి మమా అనిపించారు. టీజర్ కోసం వెయిట్ చేసిన అభిమానులు పండుగకు అయినా రాధేశ్యామ్ టీజర్ వస్తుందని భావించారు. కాని పండుగకు కూడా నిరాశే పర్చారు. పలు సినిమాల టీజర్ లు వీడియోలు పాటలు విడుదల అవుతున్న సమయంలో రాధేశ్యామ్ నుండి మోషన్ పోస్టర్ ను మాత్రమే విడుదల చేయడంతో చిత్ర యూనిట్ సభ్యుల అసమర్థత కనిపిస్తుంది అంటూ కొందరు కాస్త గట్టిగానే విమర్శలు కురిపిస్తున్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా విడుదలకు ఇంకా సమయం చాలా ఉన్న కారణంగా ఇప్పటి నుండే టీజర్ ఎందుకు అన్నట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ బర్త్ డే కు లేదా దసరాకు రాధేశ్యామ్ టీజర్ విడుదల అయ్యి ఉంటే రామరాజు ఫర్ భీమ్ వీడియోకు గట్టి పోటీ ఇవ్వడం జరిగేది. పండుగకు రెండు వీడియోలతో అభిమానులు మరియు ప్రేక్షకులకు విజువల్ వండర్ గా ఉండేది.Source link

www.tupaki.com