ప్రభాస్20 మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా..?



AR Rahman To Compose Music For #Prabhas20

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ప్రభాస్ 20’ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ  తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తుండటంతో అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ కి చేరుకున్నాయి. సాహో లాంటి భారీ సినిమా తరువాత ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇటీవలే యూరప్ షెడ్యూల్ ను ముగించుకున్న ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. 1960 కాలం నాటి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రేక్షకులకు తప్పకుండా ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అవుతుందని చిత్రయూనిట్ ధీమాతో ఉన్నారట. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో.. పాన్ ఇండియా మూవీగా తెలుగు – తమిళ హిందీతో పాటు ఇతర బాషలలో విడుదల కానుంది.

అన్నీ ఉన్నా ఇంతవరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ కాలేదు. మొదటగా ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమిత్ త్రివేది కూడా క్లారిటీ ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారనే.. విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా సంగీతం విషయంలో ఓ నయా వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే.. డార్లింగ్ ప్రభాస్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఆర్ రెహమాన్ కావడం విశేషం. ఇదే గనక నిజమైతే ప్రభాస్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఓ మంచి గ్రాండియర్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *