ఫొటోటాక్ : అమ్మతో అల్లు అబ్బాయిలు

Movie Newsసోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ ఇటీవల ఈ ఫొటోను
ట్విట్టర్ లో షేర్ చేశాడు. అల్లు బ్రదర్స్ బాబీ.. అర్జున్ మరియు
శిరీష్ లు తమ తల్లి నిర్మలతో కలిసి ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు. ఈ ఫొటో
సంక్రాంతి సందర్బంగా తీసుకుని ఉంటారు. అయితే కాస్త ఆలస్యంగా శిరీష్ ఈ
ఫొటోను ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో బాగా వైరల్
అవుతుంది. ఈ ఫొటోను ట్వీట్ చేసిన శిరీష్ అమ్మాస్ బాయ్స్ అంటూ కామెంట్
పెట్టాడు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భార్య అయిన నిర్మల అల్లు
మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తారు. అందుకే ప్రస్తుతం ఈ ఫొటో అందరి
దృష్టిని ఆకర్షిస్తుంది. ముగ్గురు కొడుకులు కూడా ఇండస్ట్రీలో ఉండటంతో ఆమె
ప్రస్తుతం ఎంత ఆనందంగా ఉందో ఆమె ఫేస్ లో చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు.
పైగా బన్నీ ఇటీవల అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్
దక్కించుకున్నాడు. ఆ ఆనందం కూడా ఆమె మొహంలో కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్
కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు వారి పెద్దబ్బాయి బాబీ ఇన్నాళ్లు
వ్యాపారాలు చేశాడు. ప్రస్తుతం నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం
అవుతున్నాడు. వరుణ్ తేజ్ తో ప్రస్తుతం బాబీ ఒక సినిమాను చేస్తున్నాడు. ఇక
అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల వైకుంఠపురంలో
సినిమా హిట్ తో తదుపరి సుకుమార్  చిత్రం పై దృష్టి పెట్టాడు. మరో వైపు
అల్లు శిరీష్ కూడా హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ
బ్రదర్స్ ముగ్గురు అమ్మతో కలిసి ఫోజ్ ఇవ్వడం ఫ్యాన్స్ కు మరియు
ప్రేక్షకులకు కన్నులవిందుగా ఉంది.Source link

Leave a Reply