ఫొటోటాక్ : ఆహాలో మరో చిన్న మూవీ

Movie NewsPhotoTalk: Another short movie on Aaha

తెలుగు ఓటీటీ వరుసగా చిన్న సినిమాలను.. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను
ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. కొన్ని రోజుల క్రితం ఒరేయ్
బుజ్జిగాను విడుదల చేసిన ఆహా ఇటీవల కలర్ ఫొటోను ప్రేక్షకుల ముందుకు తీసుకు
వచ్చింది. కలర్ ఫొటోకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకులు మరియు
సినీ ప్రముఖుల వారు కూడా కలర్ ఫొటోను ఆస్వాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ
సమయంలోనే ఆహా నుండి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘మా వింత గాథ వినుమా’
అంటూ అల్లు అరవింద్ కొత్త సినిమాను ప్రకటించాడు. ఆ సినిమాను నవంబర్ 13న
స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అదే రోజున మరో సినిమాను కూడా స్ట్రీమింగ్
చేయబోతున్నట్లుగా ఆహా నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

పాయల్ రాజ్
పూత్ హీరోయిన్ గా చైతన్యకృష్ణ హీరోగా దయాల్ పద్మనాభన్ దర్శకత్వంలో
రూపొందిన ‘అనగనగా ఓ అతిథి’ సినిమా రూపొందింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి
చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్
రైట్స్ ను ఆహా వారు కొనుగోలు చేశారు. నవంబర్ 13న ఆ సినిమాను విడుదల
చేయబోతున్నట్లుగా ఆహా నుండి ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ఫస్ట్
లుక్ ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లో చైతన్య కృష్ణ హీరోయిన్
పాయల్ మెడపై కత్తి పెట్టి ఉన్నాడు. ఆమె మాత్రం చాలా పొగరుతో అతడి వైపు
చూస్తుంది. పోస్టర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతోంది. పాయల్ రాజ్
పూత్ ఆర్ఎక్స్ 100 తర్వాత మరో మంచి పాత్రను ఈ సినిమాలో చేసిందని నటనకు
ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే
విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. త్వరలో ట్రైలర్ ను ప్రేక్షకుల
ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.Source link

www.tupaki.com