ఫోటో స్టోరీ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరూ ఒకచోట చేరి భోజనం చేస్తే…!

Movie NewsRare Pic Of Tollywood Directors

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరూ ఒక చోట కలవడం చాలా అరుదుగా చూస్తుంటాం. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏవైనా వేడుకలు జరిగితేనో.. అందరూ కలిసి జరుపుకునే సినీ ఉత్సవాల సమయంలోనో.. ఇండస్ట్రీలో ఏదైనా భారీ ఈవెంట్ జరిగితేనో.. పెళ్లిళ్ల సమయంలోనో తప్ప అలాంటిది సాధ్య పడదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న కొంతమంది కలిసి భోజనం చేస్తున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో దర్శకధీరుడు రాజమౌళి – వంశీ పైడిపల్లి – కొరటాల శివ – అనిల్ రావిపూడి – సుకుమార్ – సందీప్ రెడ్డి వంగా – హరీష్ శంకర్ – నాగ్ అశ్విన్ – జాగర్లమూడి క్రిష్ కనిపిస్తున్నారు.

కాగా డైరెక్టర్స్ అందరూ ఒకచోట చేరిన ఈ ఫోటోని క్రిష్ జాగర్లమూడి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి డైరెక్టర్స్ ని ట్యాగ్ చేస్తూ ”జీవితం అనేది అవకాశాల పరంపర. మన జీవితాలు మనం తీసుకునే మరియు మనం తీసుకోని వారి కథలు” అని పోస్ట్ పెట్టాడు. అయితే ఇది లేటెస్ట్ ఫోటో కాదని తెలుస్తోంది. గతంలో వీరందరూ కలిసి దిగిన ఫోటో జ్ఞాపకాలను క్రిష్ ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఓల్డ్ పిక్ అయితేనేం ఇలా తెలుగు దర్శకులందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ సినీ అభిమానులను కనువిందు చేస్తున్నారు. ఈ ఫ్రేమ్ లో ఆర్జీవీ – పూరీ జగన్నాథ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ – సురేందర్ రెడ్డి – వీవీ వినాయక్ – శ్రీను వైట్ల వంటి డైరెక్టర్స్ కూడా ఉంటే బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.Source link

www.tupaki.com

Leave a Reply