బన్నీకి రైట్‌ టైమ్‌లో పడింది

Movie Newsబన్నీకి రైట్‌ టైమ్‌లో పడింది

సరైనోడు టైమ్‌లో అల్లు అర్జున్‌ రేంజ్‌ ప్రతి సినిమాకీ పెరుగుతూ వెళ్లింది. అయితే డిజె, నా పేరు సూర్య లాంటి సినిమాలు అతడి జోరుకి కళ్లెం వేసాయి. దీంతో ఒక ఏడాది పాటు పూర్తిగా షూటింగ్స్‌కి దూరమయి తనకి ఎలాంటి సినిమా కావాలో అడిగి మరీ త్రివిక్రమ్‌తో ‘అల వైకుంఠపురములో’ చేయించుకున్నాడు. ఈ చిత్రం ప్లానింగ్‌ పరంగా చాలా విషయాల్లో బన్నీనే డెసిషన్‌ తీసుకున్నాడు.

గీతా ఆర్ట్స్‌ని నిర్మాణంలో కావాలని భాగస్వామిని చేసి తనతో వుండే బన్నీ వాస్‌ లాంటి వాళ్ల సలహాలు, సూచనలు కూడా అమలయ్యేలా చూసుకున్నాడు. మొత్తానికి తాను ప్లాన్‌ చేసినట్టుగానే ‘అల వైకుంఠపురములో’ భారీ హిట్టయింది. చాలా చిత్రాలతో పోటీ పడినా కానీ సంక్రాంతికి అసలైన విజేతగా నిలిచింది. అల్లు అర్జున్‌ ఈ విజయంతో మరోసారి టయర్‌ 1 హీరోల పోటీలోకి వచ్చేసాడు.

సుకుమార్‌తో ఒక వెరైటీ సినిమా తలపెట్టిన అల్లు అర్జున్‌కి ఇప్పుడీ విజయం చాలా కీలకం. ఒకవేళ ఈ చిత్రం అటు ఇటు అయినట్టయితే సుకుమార్‌ సినిమా విషయంలో చాలా అనుమానాలు ఏర్పడేవి. దాంతో సుకుమార్‌కి కూడా తగినంత ఫ్రీడమ్‌ దొరికేది కాదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్‌ రెట్టించిన ఉత్సాహంతో ఈ చిత్రం చేస్తాడు. సుకుమార్‌కి ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇస్తే రిజల్ట్‌ ఎలా వుంటుందనేది రంగస్థలంతో చూపించాడు.Source link

Leave a Reply