‘బాలీవుడ్ బాద్ షా’కు జోడీగా సొట్టబుగ్గల సుందరి…?

Movie NewsTaapsee paired with 'Bollywood Badshah' ...?

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ‘ఝుమ్మందినాధం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్
గా అడుగుపెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ
తాప్సీకి అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’
‘గుండెల్లో గోదారి’ ‘సాహసం’ ‘ఘాజీ’ ‘ఆనందో బ్రహ్మ’ ‘నీవెవరో’ ‘గేమ్ ఓవర్’
వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పదేళ్ల సినీ కెరీర్లో
తాప్సీ తెలుగులో ఒక్క సోలో బ్లాక్ బస్టర్ కూడా అందుకోలేకపోయింది. కానీ
బాలీవుడ్ లో మాత్రం వరుస విజయాలు అందుకుంటూ వస్తోంది. ‘చష్మే బద్దూర్’
‘బేబీ’ ‘పింక్’ ‘నామ్ సభానా’ ‘రన్నింగ్ షాదీ’ ‘సూర్మా’ ‘ముల్క్’ ‘బద్లా’
‘మిషన్ మంగళ్’ ‘సాండ్ కీ ఆంఖ్’ ‘తప్పడ్’ వంటి చిత్రాలు ఆమెని బాలీవుడ్ లో
స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి. ఈ క్రమంలో తాప్సీ మరో బంపర్ ఆఫర్
కొట్టేసిందని బీ టౌన్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

కాగా
సొట్టబుగ్గల సుందరి తాప్సీ బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కి జోడీగా
నటించే ఛాన్స్ కొట్టేసిందని బాలీవుడ్ మీడియా చెప్తోంది. ‘జీరో’ సినిమా
ప్లాప్ అయిన తర్వాత మరో సినిమాని అనౌన్స్ చేయని కింగ్ ఖాన్ షారూక్..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ
సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరపగా.. తాప్సీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్
వచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ఇదే కనుక నిజమైతే తాప్సీ టాప్ హీరోయిన్ గా మారే అవకాశాలున్నాయని
చెప్పవచ్చు. తాప్సి గతంలో రెడ్ చిల్లీస్ బ్యానర్ లో షారూక్ ఖాన్ నిర్మించిన
‘బద్లా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.Source link

www.tupaki.com

Leave a Reply