బాలీవుడ్ వెళ్లబోతున్న నాని విశ్వక్ సేన్ మూవీ



Is Dil Raju Remaking Yet Another Telugu Film In Bollywood?

నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం హిట్. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించింది. సినిమా థియేటర్లలో మాత్రమే కాకుండా డిజిటల్ గా కూడా హిట్ అయ్యింది. ఒక్క కేసు ఇన్వెస్టిగేషన్ ను సినిమా మొత్తం చూపించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. హిట్ చిత్రం ఇప్పుడు రీమేక్ కు సిద్దం అయ్యింది. దిల్ రాజు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు.

హిందీలో యంగ్ స్టార్ హీరోతో ఈ సినిమా రీమేక్ చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. దిల్ రాజు బాలీవుడ్ లో వరుసగా సినిమాలను చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు. మీడియం బడ్జెట్ తో హిందీలో సినిమాలను నిర్మించి అక్కడ సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు వరుసగా రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారు.

హిట్ మూవీ రీమేక్ పై ఇప్పటికే ఒక హీరో ఆసక్తి చూపిస్తున్నాడని ఆయనతో చర్చలు జరపడంతో పాటు యంగ్ డైరెక్టర్ కు ఈ సినిమా రీమేక్ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను దిల్ రాజు నిర్మించేందుకు చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే ఈ రీమేక్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *