‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..?

Movie News'Bigg Boss' Beauty Reunion Engagement Happened ..?

టాలెంటెడ్ బ్యూటీ పునర్నవి భూపాలం ‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని
రోజు’ చిత్రాలలో కీలక పాత్రలలో నటించింది. ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా
మారిన పునర్నవి.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ – 3 తో మంచి క్రేజ్
తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే పొట్టి
పొట్టి డ్రెస్సులు ధరించి బిగ్ బాస్ హౌజ్ ని హీటెక్కించింది. ఇదే క్రమంలో
సింగర్ రాహుల్ సింప్లిగంజ్ – పునర్నవి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ నిత్యం
వార్తల్లో నిలిచింది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని.. తాము స్నేహితులమని
చెబుతూ వచ్చారు. ‘బిగ్ బాస్’ నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టీవ్
గా ఉంటూ టచ్ లో ఉంటోంది. అలానే కొన్ని సినిమాలు – వెబ్ సిరీస్ లలో నటిస్తూ
బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో పున్ను పెట్టిన పోస్ట్
అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.

పునర్నవి లేటెస్టుగా ఇంస్టాగ్రామ్ లో
ఓ ఫోటో షేర్ చేస్తూ ”ఫైనల్లీ! ఇట్స్ హ్యాపెనింగ్” అని పోస్ట్ పెట్టింది.
ఈ ఫొటోలో పునర్నవి భూపాలం చేతిని పట్టుకొని ఎదురుగా మరో వ్యక్తి
కనిపిస్తున్నారు. అందులోనూ పునర్నవి ఫింగర్ కి రింగ్ కూడా కనిపిస్తోంది.
దీంతో పున్ను ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే దీనికి బ్లాక్ హార్ట్ ఎమోజీని జత చేయడం అందరికీ డౌట్ కలిగిస్తోంది.
బ్లాక్ హార్ట్ ఎమోజీని లవ్ ని ఎక్ష్ప్రెస్స్ చేయడానికి సింబల్ గా
భావించారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పునర్నవి నటించే కొత్త వెబ్
సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ పోస్ట్ పెట్టిందా అని కొందరు నెటిజన్స్
అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పునర్నవి భూపాలం నిజంగానే నిశ్చితార్థం
చేసుకుందా లేదా అనేది తెలియాలంటే అమ్మడు అఫీసియల్ గా ప్రకటించే వరకు
ఆగాల్సిందే.Source link

www.tupaki.com