బిబి4 : మొదటి వైల్డ్ నే పట్టించుకోవడం లేదు మరో వైల్డ్ కార్డా?

Movie Newsanother wild card entry in bigg boss 4

మొదటి వారం పూర్తి అయిన తర్వాత ఇంట్లోకి కమెడియన్ కుమార్ సాయిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపించిన విషయం తెల్సిందే. షో లో కమెడియన్స్ లేరు అనే లోటు ఉండకూడదు అంటూ అతడిని పంపిస్తే ఇంట్లో వారు మాత్రం అతడిని అస్సలు పట్టించుకోవడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో లాస్య మరియు సుజాత మాట్లాడుకుంటూ అతడిని మనం దూరం పెడుతున్నామా అనుకున్నారు. తెలియకుండానే అతడు ఆలస్యంగా వచ్చాడు కనుక దూరం పెడుతున్నారు అంటూ అందరికి అనుమానం వస్తుంది. ఇలాంటి సమయంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ రాబోతున్నాడు.

నిన్నటి ఎపిసోడ్ లో ప్రమో ఇచ్చారు. దాంట్లో జోకర్ ను నేను అంటూ కొత్త కంటెస్టెంట్ రాబోతున్నాడు. జోకర్ వేశం వేసుకుని ఉండటంతో అతడు ఎవరు అనే విషయంపై స్పష్టత లేదు. అయితే గత కొన్ని రోజులుగా కుమార్ సాయితో పాటు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నేటి ఎపిసోడ్ లో ఆ జోకర్ మొహం వెనుక ఉన్నది ఎవరో క్లారిటీ రాబోతుంది.

అవినాష్ కాని మరెవ్వరైనా అవ్వనీ కాని అతడిని మాత్రం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. కుమార్ సాయి మాదిరిగా కాకుండా అందరితో కలుపుకు పోయి అందరిని నవ్విస్తే పర్వాలేదు పోయి ఒక మూలకు తాను కూడా కూర్చున్నట్లుగా ఉంటేమాత్రం అతడిని కూడా పాత కంటెస్టెంట్స్ పక్కన పెట్టే అవకాశం ఉంది అనిపిస్తుంది. నేటి ఎపిసోడ్ తో అవినాష్ ను ఎలా స్వీకరిస్తారు అనేది చూడాలి.Source link

www.tupaki.com

Leave a Reply