మరో ఓటీటీ ప్రాజెక్ట్ లో తమన్నా

Movie NewsTamannah in another OTT project

ఈమద్య కాలంలో స్టార్స్ ఎక్కువ మంది ఓటీటీ పై ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లకే ఎక్కువ క్రేజ్ ఉండేది. కాని ఈమద్య కాలంలో ఇండియాలో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. కనుక పలువురు స్టార్స్ ఓటీటీలో కనిపించేందుకు ఓకే చెబుతున్నారు. సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. వెబ్ సిరీస్ లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో పారితోషికాలు కూడా భారీగా ఉంటున్నాయి. సినిమాలు అయినా ఓటీటీ అయినా పారితోషికం భారీగా వస్తే చాలు అనుకునే వారు వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు రెడీగా ఉంది.
 
ఇప్పటికే ఈమె ఆహా కోసం ఒక టాక్ షో చేస్తుందట. వంద మంది సెలబ్రెటీలతో ఈమె టాక్ షో రెండు లేదా మూడు సీజన్ లుగా సాగుతుందని ఇందుకోసం తమన్నాకు ఆహా వారి నుండి భారీ పారితోషికం అందుతున్నట్లుగా గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులను నటింపజేస్తున్నాడు.

చాలా యూనిక్ కాన్సెప్ట్ తో ఏమాత్రం సినిమాకు తగ్గకుండా ఉండే సీన్స్ తో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. ప్రముఖ ఓటీటీ ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు విడుదల అయ్యే విషయమై మరో నెల రోజుల్లో దర్శకుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తమన్నా ఎంట్రీతో ఆ వెబ్ సిరీస్ వెయిట్ పెరిగినట్లే. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాని ఈ సమయంలో తమన్నా వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తుందేమో చూడాలి.Source link

www.tupaki.com

Leave a Reply