మరో హీరోయిన్ తో శింబు ఎఫైర్

Movie NewsShimbu Affair with Another Heroine

రొమాంటిక్ హీరో శింబు ఎఫైర్లు నిరంతరం మీడియాలో హాట్ టాపిక్. కెరీర్
ఆరంభంలో నయనతారతో ఘాటైన ప్రేమాయణం అటుపై సహజీవనం సంచలనమైంది. ఆ
తర్వాత ఆపిల్ బ్యూటీ హన్సికతో సుదీర్ఘ కాలం ప్రేమాయణం సాగించి పెళ్లి
వరకూ వెళ్లాడు. ఇంకా శింబు జాబితాలో పలువురు హీరోయిన్లు ఉన్నారు
అన్నవార్తలు అంతే వేడెక్కించాయి. క్యూట్ త్రిష.. యంగ్ బ్యూటీ ఓవియో ..
గాయని కం నటి ఆండ్రియాతోనూ శింబు ఎఫైర్లు నడిపించాడని కోలీవుడ్
మీడియాలో ప్రచారమైంది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం శింబు ఎలాంటి
ఎఫైర్లు లేకుండా క్లీన్ గా ప్యూర్ గా ఉన్నాడు. కేవలం సినిమా కెరీర్ పైనే
ఫోకస్ పెట్టాడు. ఇటీవలే తండ్రి టి. రాజేందర్ త్వరలో శింబుకు పెళ్లి
చేస్తానని ప్రకటించడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.

ఆ పెళ్లి
సంగతేమో కానీ.. తాజాగా శింబు మరో యంగ్ హీరోయిన్ తో డీప్ లవ్ లో
ఉన్నాడని కథనాలు హీటెక్కిస్తున్నాన్నాయి. `అన్నకొడి` చిత్రంతో కోలీవుడ్
కి పరిచయమైన సుభిక్ష తో రొమాంటిక్ శింబు జోరుగా షికార్లు
చేస్తున్నాడని.. జంటగా ఉన్న కొన్ని ఫోటోలు చెబుతున్నాయి. సుభిక్షను
శింబు పెళ్లి చేసుకుంటాడని…రాజేందర్ వెతికిన పెళ్లి కూతురు కూడా తనే
అంటూ.. కోలీవుడ్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.


ప్రచారం మరీ పీక్స్ కు చేరుకోవడంతో సుభిక్ష నేరుగా రంగంలోకి దిగింది.
శింబు పై నాకు గౌరవం ఉంది. ఆయన కేవలం స్నేహానికి మాత్రమే
ప్రాముఖ్యతనిస్తారు. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే. ఓ కార్యక్రమం
లో కలిసి పాల్గొనడమే తప్పయ్యిందా? అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య
ప్రేమ వ్యవహారం ఉందని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అవన్నీ వదంతులు
మాత్రమే.. ఎవరూ నమ్మవద్దు అంటూ సుభిక్ష కోరింది. శింబు తో కలిసి
ఎన్నో సినిమాలు చేయాల్సి ఉంది. అప్పుడే ఇలాంటి పుకార్లు ఏంటి అంటూ అసహనం
వ్యక్తం చేసింది.Source link

Leave a Reply