మరో హీరోయిన్ ఫ్యామిలీలో కరోనా కలకలం

Movie NewsCharmme Announces That Her Parents Are COVID-19 Positive!

కొన్ని రోజుల క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అంటూ చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా తమన్నా సోషల్ మీడియాలో తెలియజేసింది. కొన్ని రోజులకు వారు కరోనాను జయించారు. వారు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తమన్నా కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరో హీరోయిన్ ఛార్మి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని స్వయంగా ఛార్మి వెళ్లడించింది.

తన తల్లిదండ్రుల ఆరోగ్య విషయమై ఛార్మి స్పందిస్తూ.. కరోనా అంటూ నిర్థారణ అయిన వెంటనే అమ్మానాన్న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వారి పరిస్థితి తెలిచి చాలా బాధపడ్డాను. త్వరలోనే వారు కరోనాను జయించి ఆరోగ్యంతో చూడాలని ఆశిస్తున్నాను. వారికి అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొంది.

ఎవరైనా చిన్న లక్షణం కనిపించినా కూడా వెంటనే పరీక్ష చేయించుకోండి. అశ్రద్ద అస్సలు వద్దు అంటూ ఛార్మి సూచించింది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తుంది. నటిగా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ఛార్మి నిర్మాతగా వరుసగా పూరితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.Source link

www.tupaki.com