మహేష్ కోసం భారీ ఖర్చుతో బ్యాంకు సెట్.. సిద్దమైందా..?



bank set at huge cost for Mahesh .. ready?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మరోసారి తన
బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ – మహేష్ బాబుల
కాంబినేషన్ ఖచ్చితంగా వెరైటీగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా
వేస్తున్నాయి. కానీ సర్కారు వారి పాట టైటిల్ అయితే విపరీతంగా బజ్ క్రియేట్
చేసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే
ప్రేక్షకుల నుండి ఊహించని రేంజిలో స్పందన లభించింది. ఈ సినిమాకి సంబంధించి
ఇటీవల పోస్టర్ విడుదల కాగా ఇందులో మహేష్ లాంగ్ హెయిర్ లైట్ బియర్డ్ తో
ఇంతక ముందెప్పుడూ చూడని మాస్ లుక్లో కనిపించి కిక్ ఇచ్చాడు.

ఇటీవలే
ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? అనే సందేహం అందరిలో ఉంది. అయితే ఈ సినిమా
ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని సమాచారం.
బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను చర్చలోకి తీసుకొస్తుందట. ఈ
సినిమాలో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా కనిపించనున్నాడని టాక్. అయితే తాజా
సమాచారం ప్రకారం.. పరశురామ్ టీమ్ ఈ సినిమాకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో
బ్యాంకు సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోనే మాక్సిమం షూటింగ్ అయిపోతుందని
అంటున్నారు. సెట్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నారట. షూటింగ్
తేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ రొమాన్స్
చేయనుంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్..
14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం
సమకూరుస్తున్నాడు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *