మహేష్ బాబు కరోనా అలర్ట్Mahesh Babu Alerts With Corona Virus

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ఇన్ని రోజులు హైదరాబాద్ కు రాకపోవచ్చులే అనుకున్నారు. కాని హైదరాబాద్ లో కూడా కరోనా వైరస్ బారిన పడ్డ వ్యక్తిని గుర్తించారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం చర్చ జరుగుతోంది. మీడియాలో కూడా ప్రముఖంగా దీని గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో జనాలు చిగురుటాకుల మాదిరిగా వణికి పోతున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రెటీలు ఈ వైరస్ గురించి జనాల్లో అవగాణ కల్పించాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకుంటే రాదనే విషయాన్ని ప్రముఖులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ తో జాగ్రత్త అంటూ కరోనా అలర్ట్ హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ పెట్టాడు.

మహేష్ బాబు పోస్ట్ లో భయపడాల్సిన పని లేదు కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో చేయవల్సినవి అస్సలు చేయకూడనివి అంటూ లిస్ట్ ఉన్న ఇమేజ్ ను షేర్ చేశాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మొదటి సారి కరోనా గురించి స్పందించిన హీరోగా మహేష్ బాబు నిలిచాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *