మెగా మేనల్లుడి సెంటిమెంట్ ఏంటో తెలిస్తే అవాక్కే!

Movie NewsSolo Brathuke So Better Theatrical Release On Dec?

క్రేజీ హీరోలంతా సంక్రాంతి రేసుకి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు సంక్రాంతి వార్ ని డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. రానున్న సంక్రాంతి బరిలోకి రానా.. అఖిల్ అక్కినేని రామ్.. మాస్ రాజా రవితేజతో పాటు డజను మంది పైగానే పోటీకి దిగుతున్నారు. పాన్ ఇండియా మూవీ `అరణ్య`తో రానా.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`గా అఖిల్ అక్కినేని… మాస్ ఎంటర్టైనర్ `క్రాక్`తో రవితేజ.. సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ `రెడ్`తో రామ్ క్రేజీగా పోటీపడుతున్నారు.

ఇదిలా వుంటే ఈ సినిమాలతో పాటు తన మూవీ కంప్లీట్ అయినా మెగా మేనల్లుడు సాయి తేజ్ మాత్రం సంక్రాంతి బరిలోకి రానంటున్నాడు. సాయి తేజ్ నటిస్తున్న చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్` ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నదానిపై తర్జనభర్జన సాగుతోందట. ఈ చిత్రంతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్నా రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయకపోవడానికి కారణమేంటో స్పష్ఠంగా తెలియరాలేదు.

అయితే సాయి తేజ్ మాత్రం సెంటిమెంటు ఫీలవుతున్నారట. డిసెంబర్ మూడవ వారంలో ఈ మూవీని రిలీజ్ చేయాలని అడిగారట. కారణం గత ఏడాది సాయి తేజ్ నటించిన `ప్రతిరోజు పండగే` డిసెంబర్ చివరి వారంలో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా హీరోగా తన మార్కెట్ స్థాయిని పెంచింది. దీంతో డిసెంబర్ ని సెంటిమెంట్ గా మార్చుకున్నాడట. ఆ సెంటిమెంట్ ప్రకారమే `సోలో బ్రతుకే సోబెటర్`ని డిసెంబర్ మూడవ వారంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చిత్రబృందం అధికారికంగా ఖాయం చేయాల్సి ఉంది ఇంకా.Source link

www.tupaki.com