‘మ్యూజిక్ ఇండస్ట్రీలో సూసైడ్స్ చూడబోతున్నారు’..!!Suicides are going to be seen in the music industry Famous Singer Sensational Comments

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంతో భవిష్యత్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్ లో ఉన్నారని.. ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే సుశాంత్ బలవన్మరణానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు బాధ్యులు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కొంతమంది నెపోటిజం ని ఎంకరేజ్ చేస్తూ టాలెంట్ ని తొక్కేస్తున్నారని విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న అనుభవాలను.. సినీ పరిశ్రమలోని ఒత్తిళ్లను బయటపెడుతున్నారు. కంగనా రనౌత్ ప్రకాష్ రాజ్ అభినవ్ కశ్యప్ లాంటి సినీ ప్రముఖులు దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు.

ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆత్మహత్యలు చూస్తారని ఆయన పేర్కొనడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కేవలం రెండు కంపెనీలు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయని.. సినీ రంగం కంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద మాఫియాలు ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకుండా మానసికంగా వేధించడం.. నెపోటిజం తో స్టార్ కిడ్స్ కే ఛాన్సెస్ ఇస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ సమయంలో సోను నిగమ్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సోను నిగమ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు.. మ్యూజిక్ కంపెనీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *