యువ హీరో ఓటీటీ రిలీజ్ పైనే ఆశలు పెట్టుకున్నాడా…?

Movie NewsRaj Tarun Film Orey Bujjiga Direct OTT Release

తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో డబ్బింగ్ సినిమాలతో పాటు కొన్ని కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘కలర్ ఫోటో’ అనే మరో రెండు సినిమాలను వచ్చే నెలలో స్ట్రీమింగ్ చేయనుంది. యువ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ‘గుండజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ – హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఉగాదికి విడుదల చేయాలని ప్లాన్ చేసుకో గా కరోనా లాక్ డౌన్ కారణం గా కుదర లేదు. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేక పోవడం తో ఓటీటీ లో రిలీజ్ కి రెడీ చేశారు.

కాగా ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా పైనే  హీరో రాజ్ తరుణ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్య యువ హీరో నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. అయితే ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా బాగున్నా రాజ్ తరుణ్ కి సక్సెస్ క్రెడిట్ దక్కకపోవచ్చు అంటున్నారు. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమా లు హిట్ అవుతున్నా అలా వచ్చే సక్సెస్ ని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ఓటీటీలలో మంచి సినిమా అనే టాక్ తెచ్చుకున్న సినిమాల హీరో హీరోయిన్స్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. అందులోనూ ‘ఆహా’లో డబ్బింగ్ సినిమాలకి వస్తున్న క్రేజ్.. డైరెక్ట్ సినిమాల కు లేదని ఓటీటీ వర్గాల్లో టాక్ ఉంది. ఏదేమైనా ‘ఆహా’లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలతో పోల్చుకుంటే కాస్త పేరున్న హీరో సినిమా ఇదే అని చెప్పవచ్చు. మరి అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ఒరేయ్ బుజ్జి గా’ ఓటీటీ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.Source link

www.tupaki.com

Leave a Reply