యువ హీరో హోమ్ ప్రొడక్షన్ మూవీ చాలా లేట్ అయ్యేలా ఉందే..!

Movie NewsNaga Shaurya Upcoming Movie Updates

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ బిజీగా మారిపోయాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. దీంతో పాటు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో హోమ్ బ్యానర్ లో ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసాడు. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉందని ఫిలిం అంటున్నారు. దీనికి కారణం శౌర్య ఇప్పుడు వరుస సినిమాలు కమిట్ అవ్వడం అనే టాక్ ఉంది. ‘వరుడు కావలెను’ సినిమా మరియు #NS20 ప్రాజెక్ట్స్ ముగిసాకే శౌర్య తన సొంత బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. దీంతో అనీష్ కృష్ణ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. శ్రీ విష్ణు – రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలతో ‘గాలి సంపత్’ అనే సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా పూర్తి చేసి నాగశౌర్య తో సినిమా స్టార్ట్ చేస్తాడు.Source link

www.tupaki.com